విమాన ప్రమాదం వల్లే మంత్రి రాలేకపోయారు: దిల్ రాజు | Producer Dil raju Comments On Gaddar Awards function | Sakshi
Sakshi News home page

Dil raju: 'ప్రతి ఒక్కరిని ఆహ్వానించాం.. ఉత్తమ చిత్రానికి నాలుగు అవార్డులు'

Jun 12 2025 8:09 PM | Updated on Jun 12 2025 8:25 PM

Producer Dil raju Comments On Gaddar Awards function

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన దురదృష్టకరమని టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు విచారం వ్యక్తం చేశారు. లండన్ బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కుప్పకూలడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. గద్దర్ అవార్డుల వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు. విమాన ప్రమాదం జరగటం మంత్రి కోమటిరెడ్డి  ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు.

ఇప్పటికే గద్దర్ అవార్డు గ్రహీతలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించామని  ఇవాళ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ వేడుకను లైవ్ టెలికాస్ట్ చేస్తామని ప్రకటించారు. అందరూ తప్పకుండా హాజరైన ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ చేయాలని దిల్ రాజు కోరారు. ప్రతి ఉత్తమ చిత్రానికి హీరో, హీరోయిన్, దర్శక, నిర్మాతలకు కలిసి నాలుగు అవార్డులు అందజేస్తామని తెలిపారు. ఇలా ప్రతి ఏడాదిలో మూడు సినిమాలకు ఇస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుల వేడుక ఈనెల 14న హైదరాబాద్‌లో జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement