సీఎం రేవంత్‌ సమక్షంలో అల్లు అర్జున్‌ మాస్‌ డైలాగ్‌..వీడియో వైరల్‌ | Gaddar Awards 2025: Allu Arjun Say Pushpa 2 Dialouges On Stage | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ సమక్షంలో అల్లు అర్జున్‌ మాస్‌ డైలాగ్‌..వీడియో వైరల్‌

Jun 14 2025 10:12 PM | Updated on Jun 15 2025 12:01 PM

Gaddar Awards 2025: Allu Arjun Say Pushpa 2 Dialouges On Stage

తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుకలో అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. 2024 ఏడాదిగాను పుష్ప-2 మూవీకి అల్లు అర్జున్‌ ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఈ సందర్బంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. పుష్ప 2 చిత్రానికి అందిన తొలి అవార్డు ఇది. తెలంగాణ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ఈ అవార్డు వేడుకను ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను’అన్నారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో పుష్ప-2 మూవీలోని మాస్‌ డైలాన్‌ని చెప్పి ఆకట్టుకున్నాడు. ఇది సినిమా ఫంక్షన్‌ కదా.. తన సినిమాలోని డైలాగ్‌ను చెప్పవచ్చా.. అని అడిగి మరీ అల్లు అర్జున్‌ ‘రప్పా రప్పా’ డైలాగ్‌ చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement