గద్దర్‌ అవార్డులు.. జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ | Senior Actress Jaya Sudha Elected as Gaddar Awards Jury Chair Person | Sakshi
Sakshi News home page

Jaya Sudha: గద్దర్‌ అవార్డులు.. జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ

Apr 16 2025 8:39 PM | Updated on Apr 16 2025 8:39 PM

Senior Actress Jaya Sudha Elected as Gaddar Awards Jury Chair Person

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్మన్‌గా సినీ నటి జయసుధను నియమించారు. దాదాపు 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేశారు. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు పరిశీలించనున్నారు. 

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర విభాగాల్లో  76 నామినేషన్స్ వచ్చాయి. వ్యక్తిగత కేటగిరిలో 1172 నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి ఈ అవార్డులకు 1248 నామినేషన్లు వచ్చాయి. ఈ నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు కోరారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను  అందజేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement