ది 100 సినిమాను ఫస్ట్‌ డే చూస్తాను: తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి | the100 Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

ది 100 సినిమాను ఫస్ట్‌ డే చూస్తాను: తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Jul 7 2025 1:33 AM | Updated on Jul 7 2025 1:33 AM

the100 Movie Pre Release Event

శశిధర్, ఆర్‌కే సాగర్, శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, వెంకీ, రమేశ్‌

‘‘మంచి సందేశంతో ‘ది 100’ సినిమా నిర్మించారు. పోలీసాఫీసర్‌గా సాగర్‌ కరెక్ట్‌గా ఫిట్‌ అయ్యాడు. ఈ సినిమాను ఫస్ట్‌ డే చూడాలనుకుంటున్నాను. ఒక రిటైర్డ్‌ బ్యాంకు ఆఫీసర్‌ కూడా ఐదుకోట్ల రూపాయలు పోగొట్టుకున్నటువంటి సైబర్‌ క్రైమ్స్‌ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ సినిమా చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఆర్‌కే సాగర్‌ మంచి హీరో అవుతాడనిపిస్తోంది.

ఈ సంవత్సరం ‘గద్దర్‌ అవార్డ్స్‌’లో బెస్ట్‌ ఫిల్మ్‌గా ‘ది 100’ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగని నేను రికమండ్‌ చేయడం లేదు. ఈ సినిమా ట్రైలర్‌ చూసినప్పుడు అనిపించింది. ఇక పైరసీ వల్ల వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టడానికి ఆల్రెడీ మా ప్రభుత్వం పోలీస్‌ అధికారులతో మాట్లాడి యాక్షన్  తీసుకోవడం జరిగింది’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 

‘మొగలిరేకులు’ సీరియల్‌ ఫేమ్‌ హీరో ఆర్‌కే సాగర్‌ హీరోగా నటించిన చిత్రం ‘ది 100’. ఈ చిత్రంలో హీరోయిన్లు మిషా నారంగ్, ధన్య బాలకష్ణ నటించారు. రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వంలో రమేశ్‌ కరుటూరి, వెంకీ పూశడపు, జె. తారక్‌ రామ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్‌ కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ముఖ్య అతిథులుగా హాజరై, బిగ్‌ టికెట్‌ను లాంచ్‌ చేశారు. 

ఈ వేడుకలో తెలంగాణ మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ– ‘‘ది 100’ సినిమా చూశాను. ఒక పవర్‌ఫుల్‌ యాక్టింగ్‌తో మంచి సోషల్‌ మెసేజ్‌ చెప్పడానికి దర్శకుడు శశి మంచి ప్రయత్నం చేశారు. సాగర్‌ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. మా ప్రాంతవాసి. టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు... హాలీవుడ్‌లోనూ రాణించగల ప్రతిభ సాగర్‌లో ఉంది. ఐపీసీలోని మంచి సెక్షన్ లోని సారాంశంతో ‘పవర్‌ఫుల్‌ వెపన్  టు డిఫెండ్‌ యువర్‌సెల్ఫ్‌’ అనే పాయింట్‌తో తీసిన సినిమా ఇది. ఈ రోజు ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారు రావాల్సింది. కానీ ఆయనకు మరో కార్యక్రమం ఉండటం వల్ల, మాకు తెలియజేయడం జరిగింది’’ అన్నారు శ్రీధర్‌బాబు. 

ఆర్‌కే సాగర్‌ మాట్లాడుతూ– ‘‘ఐటీ మినిస్టర్‌ శ్రీధర్‌ అన్నగారు నా సినిమా చూసి, నన్ను ఆశీర్వదించారు. అలాగే నా కోసం ఈ వేడుకకు వచ్చిన వెంకట్‌రెడ్డి అన్నకు ధన్యవాదాలు. ఎస్‌. గోపాల్‌రెడ్డి, కోదండ రామిరెడ్డి, డైరెక్టర్‌ బి.గోపాల్‌ గార్లు... వాళ్ల ఫ్యామిలీలో నన్ను చేర్చుకున్నందుకు థ్యాంక్స్‌. ‘ది 100’ అనేది ఒక వెపన్ . కొందరు సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమాను చూపించినప్పుడు, వాళ్లు కన్నీళ్ళు పెట్టుకున్నారు’’ అని అన్నారు. రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ మాట్లాడుతూ– ‘‘ఓ రియల్‌ పోలీసాఫీసర్‌ జీవితంలో జరిగిన ఒక సంఘటన విని, ఇలాంటివి కూడా జరుగుతున్నాయా? అనిపించి, ఈ పాయింట్‌ను చె΄్పాలనుకున్నాను.

ఈ చిత్రంలో మహిళల గురించీ చెప్పడం జరిగింది. ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన చిత్రం’’ అని చె΄్పారు. ‘‘ది 100’లో ఎంటర్‌టైన్ మెంట్‌తో పాటు మంచి సందేశం ఉంది’’ అన్నారు నిర్మాత రమేశ్‌. ‘‘ఈ వేడుకకు వచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌ బాబుగార్లకు, మిగతా పెద్దలందరికీ థ్యాంక్స్‌’’ అని నిర్మాత వెంకీ చె΄్పారు. ఈ వేడుకలో ఎ. కోదండ రామిరెడ్డి, బి. గోపాల్, ఎస్‌. గోపాల్‌ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇంకా ‘ది 100’ చిత్రబృందంలోని పలువురు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement