స్క్రీన్‌ప్లేకి అవార్డు రావడం హ్యాపీగా ఉంది: దర్శకుడు అనిల్‌ రావిపూడి | Director Anil Ravipudi Shares His Happiness | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ప్లేకి అవార్డు రావడం హ్యాపీగా ఉంది: దర్శకుడు అనిల్‌ రావిపూడి

Mar 9 2026 12:31 AM | Updated on Mar 9 2026 9:35 AM

Director Anil Ravipudi Shares His Happiness

‘‘ప్రతి సినిమాకి ఆడియన్స్‌ ఇస్తున్న సక్సెస్‌తో ఒక తెలియని ఎనర్జీ వస్తుంది. అయితే ప్రతి సినిమాకు భయం కూడా కచ్చితంగా ఉంటుంది. లేకపోతే ప్రతి సినిమాకి అంత నిజాయితీతో పని చేయలేం. ఆడియన్స్‌ ఇచ్చే ఎనర్జీనే ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే ఈ (అవార్డు) క్రెడిట్‌ మొత్తం ఆడియన్స్‌కి ఇస్తాను’’ అని చెప్పారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్‌ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ  చిత్రానికి గాను బెస్ట్‌ స్క్రీన్‌ప్లే, బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి పంచుకున్న విశేషాలు... 

గద్దర్‌ అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. కమర్షియల్‌గా బాక్సాఫీస్‌ విక్టరీ, అలాగే అవార్డ్స్‌ కూడా రావడం అంటే ఒక దర్శకుడికి అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్‌లో చాలా స్పెషల్‌ ఫిల్మ్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ఒక చిన్న సందేశాన్ని చెబుతూ డిఫరెంట్‌ జానర్‌లో నేను ప్రయత్నించిన సినిమా ఇది. ‘భగవంత్‌ కేసరి’ వంటి సీరియస్‌ డ్రామా తర్వాత ఒక ఎంటర్‌టైన్మెంట్‌ సినిమా చేశాను. అది బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు క్రియేట్‌ చేసింది. నా కెరీర్‌కి మంచి బూస్ట్‌ ఇచ్చింది. 

నా తర్వాతి సినిమాను వెంకటేశ్‌గారితోనే చేస్తున్నాను. ఈ సమయంలో నేను ఆయనతో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కు అవార్డు రావడం అనేదిపాజిటివ్‌ వైబ్‌లా అనిపించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో క్యారెక్టర్స్‌కు, సీన్స్‌ మధ్య స్క్రీన్‌ప్లే చక్కగా కుదిరింది. స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డు రావడం అనేది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ‘దిల్‌’రాజు, శిరీష్‌గార్లతో నేను ఆరు సినిమాలు చేశాను. వాళ్లను నా ఫ్యామిలీలా ఫీలవుతాను. వాళ్ల బ్యానర్‌లో నేను చేసిన సినిమాకు గద్దర్‌ అవార్డు రావడం ఆనందాన్నిచ్చింది. ∙నా తర్వాతి సినిమాలో వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌గార్లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కొంచెం కష్టమైన స్క్రిప్ట్‌. రెండు నెలల సమయం పడుతుంది. జూన్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేసి, నవంబరులో పూర్తి చేసి, సంక్రాంతికి రిలీజ్‌ చేస్తాం.  

Advertisement
 
Advertisement
Advertisement