
నందమూరి బాలకృష్ణ స్పీచ్ గురించి తెలుగు ప్రజలకు తెలిసిందే. అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడినా.. దానిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని సందర్భాలలో అసలు అర్థమే కాదు. ఏదో చెప్పబోయి.. మరేదో చెబుతుంటారు. సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులను అవలీలగా చెప్పినా.. బయట మాత్రం చిన్న చిన్న పదాలను కూడా సరిగ్గా పలకలేక తడబడుతుంటారు.
ఆ మధ్య దేశభక్తి గేయం ‘సారే జహాసె అచ్చా’కూడా సరిగ్గా పాడలేక ట్రోలింగ్‌కి గురయ్యారు. ఇక తాజాగా మరోసారి బాలయ్య నవ్వుల పాలయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేరు మర్చిపోయి.. దాన్ని కవర్ చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టంట బాగా వైరల్ అయింది.
(చదవండి: సీఎం రేవంత్ సమక్షంలో అల్లు అర్జున్ మాస్ డైలాగ్..వీడియో వైరల్)
శనివారం సాయంత్రం హైటెక్స్‌లో జరిగిన గర్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుని ఇచ్చి సన్మానించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ అవార్డును అందజేశారు.
అనంతరం బాలకృష్ణ వారికి ధన్యవాదాలు చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో భట్టి పేరుని మర్చిపోయారు. ఆర్థిక, విద్యుత్ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి..(గ్యాప్ తీసుకున్నాడు).. మల్లు..(గ్యాప్ తీసుకున్నాడు) అంటూ పూర్తి పేరుని పలకడానికి తడబడ్డారు. చాలాసేపు నీళ్లు నములుకున్న తర్వాత పక్కనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అందించడంతో భట్టి పేరుని స్పష్టంగా పలికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
భట్టి విక్రమార్క పేరు మర్చిపోయిన బాలకృష్ణ pic.twitter.com/OMKPh0GUeo
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2025