గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆహా ఓటీటీ మూవీస్ | Gaddar Awards 2024: OTT Platform AHA Films Win Most Awards | Sakshi
Sakshi News home page

గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆహా ఓటీటీ మూవీస్

May 29 2025 5:43 PM | Updated on May 29 2025 5:48 PM

Gaddar Awards 2024: OTT Platform AHA Films Win Most Awards

తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్డ్స్‌లో ఆహా ఓటీటీ సినిమాలు తమ సత్తా చాటాయి. పలు కీలక విభాగాల్లో ఆహా చిత్రాలు అవార్డులు సాధించాయి. 'పొట్టేల్' సెకండ్ బెస్ట్ ఫిల్మ్‌గా, '35 ఇది చిన్న కథ కాదు' బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్‌గా అవార్డులు గెలుచుకున్నాయి. '35 ఇది చిన్న కథ కాదు' చిత్రంలో నటనకు నివేదా థామస్ బెస్ట్ హీరోయిన్‌గా, 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'లో నటనకు శరణ్య ప్రదీప్ ఉత్తమ సహాయ నటిగా, 'రజాకార్' చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గద్దర్ అవార్డులు అందుకున్నారు.

'35 ఇది చిన్న కథ కాదు'లో నటించిన మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల, 'మెర్సీ కిల్లింగ్'లో నటించిన బేబీ హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంపికయ్యారు. 'రాజు యాదవ్' చిత్రానికి చంద్రబోస్ బెస్ట్ లిరిసిస్ట్‌గా, 'రజాకార్'కు నల్ల శ్రీను బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్‌గా అవార్డులు పొందారు. 'పొట్టేల్'లో నటనకు అనన్య నాగళ్ల, 'రాజు యాదవ్' నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లేపల్లి స్పెషల్ జ్యూరీ అవార్డులు సాధించారు.

ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు ప్రధాన విభాగాల్లో గద్దర్ అవార్డులు గెలవడంపై ఆహా టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గ చిత్రాలు, సిరీస్‌లు, షోలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కంటెంట్ అందించడమే తమ లక్ష్యమని ఆహా టీమ్ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement