
‘‘ప్రభుత్వ అవార్డులను స్వీకరించాలి. షూటింగుల్లో బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రభుత్వం నుంచి అవార్డు వస్తుందంటే స్వీకరించడం మన బాధ్యత. ప్రభుత్వంతో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిదీ. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నుంచి అవార్డులు ప్రకటించినప్పుడు ఆ తేదీలను డైరీలో నోట్ చేసుకుని, ఒకవేళ మీకు అవార్డు ఉంటే ఆ అవార్డును స్వీకరించాలి. ఇది నా రిక్వెస్ట్. అది ఏ రాష్ట్రమైనా కానివ్వండి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అవార్డులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు మనకు రెండు కళ్లు’’ అని అన్నారు.
తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎఫ్‌డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజు, ఎఫ్‌డీసీ ఎండీ హరీష్ ఐఏఎస్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘తెలం గాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక సక్సెస్ కావడం సంతోషంగా ఉంది. అవార్డులు స్వీకరించిన అందరికీ ఎఫ్‌డీసీ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం. తెలంగాణ సీయం రేవంత్‌రెడ్డిగారికి స్పెషల్ థ్యాంక్స్.
సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్కగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంత పెద్ద ఈవెంట్‌లో చిన్న చిన్న తప్పులు ఉండొచ్చేమో. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏమైనా తప్పులు జరిగి, ఈవెంట్‌కు వచ్చినవారు ఒకవేళ హర్ట్ అయితే ఎఫ్‌డీసీ తరఫున చైర్మన్‌గా క్షమాపణలు కోరుతున్నాను’’ అని అన్నారు. ‘‘సీయం రేవంత్ రెడ్డిగారి ఆదేశాలతో, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగారి గైడెన్స్‌తో, ఎఫ్‌డీసీ చైర్మన్ ‘దిల్’ రాజుగారి విజన్‌తో తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించుకున్నాం. ఈ సక్సెస్‌కు కారణమైన ప్రతి ఒక్కరీ కృతజ్ఞతలు’’ అన్నారు ఎఫ్‌డీసీ ఎండీ హరీష్.