'దండోరా'.. చాలా అవార్డులు వస్తాయి | Dandora Movie Shines At Telangana Gaddar Awards 2025, Wins In Three Categories, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

'దండోరా'.. చాలా అవార్డులు వస్తాయి

Mar 8 2026 5:59 PM | Updated on Mar 8 2026 6:54 PM

Dhandoraa Movie And Gaddar Awards Meet Updates

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 'గద్దర్ అవార్డులు-2025'లో 'దండోరా' సినిమా సత్తా చాటింది. మూడు విభాగాల్లో అవార్డుల్ని దక్కించుకుంది. ర‌వీంద్ర బెన‌ర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. తమ సినిమాకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, ఇచ్చిన గుర్తింపు సందర్భంగా ఆదివారం నాడు థాంక్స్ చెబుతూ మీడియా సమావేశం నిర్వహించారు.

(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!)

మా 'దండోరా' సినిమాని గుర్తించి అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ మూవీ ఇంకా చాలా దూరం వెళ్తుందని నమ్ముతున్నాను. ఇక్కడితో ఆగే సినిమా అయితే కాదు. మున్ముందు చాలా అవార్డులు వస్తాయని ఆశిస్తున్నానని నటుడు శివాజీ అన్నారు.

ముందు నుంచీ మా సినిమాని సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్. మాకు ఈ గుర్తింపు, అవార్డుల్ని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్. గద్దర్ అన్న పాటలు చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడ్ని. ఈ రోజు గద్దర్ అవార్డుల్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ రావడం నాకు పెద్ద గౌరవం లాంటిది అని సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు)

Advertisement
 
Advertisement
Advertisement