విడాకులు.. తాగుడుకు బానిసయ్యా.. చావే దిక్కనుకున్నా! | Actor Bhagath Manuel about First Marriage and Divorce | Sakshi
Sakshi News home page

లవ్‌ మ్యారేజ్‌- విడాకులు.. కొడుకు నా దగ్గరే.. రెండో పెళ్లి తర్వాతే..

Mar 9 2026 12:22 PM | Updated on Mar 9 2026 12:25 PM

Actor Bhagath Manuel about First Marriage and Divorce

రెండో భార్యతో నటుడు భగత్‌

విడాకుల బాధ భరించలేక మద్యపానానికి బానిసయ్యానంటున్నాడు మలయాళ నటుడు భగత్‌ మాన్యుయెల్‌. చావు అంచులదాకా వెళ్లిన తనను స్నేహితులే కాపాడారని చెప్తున్నాడు. భగత్‌ మాన్యుయెల్‌ గతంలో డాలియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2017లో బాబు పుట్టాడు. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. అనంతరం 2019లో జుంబా ట్రైనర్‌ షెలిన్‌ చెరిన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం తనతో సంతోషంగా ఉంటున్నాడు.

లవ్‌ మ్యారేజ్‌
మొదటి పెళ్లి గురించి భగత్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాతే నేను పెళ్లి చేసుకున్నాను. మాది ప్రేమ వివాహం. మా దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. మేము విడాకులు తీసుకుంటామని కలలో కూడా అనుకోలేదు. మా బంధం తెగిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. తాగడం మొదలుపెట్టాను. నా కొడుకు బాధ్యత నేనే తీసుకున్నాను. 

ఏరోజూ ఒంటరిగా..
వాడి బాగోగులు మా అమ్మానాన్నే చూసుకున్నారు. నేను సమస్యలతో సతమతమవుతున్న సమయంలో నా ఫ్రెండ్స్‌ అందరూ బిజీగా ఉన్నారు. వాళ్లందరూ నేను కూడా బిజీగా ఉన్నానని అనుకున్నారు. కానీ ఒంటరిగా కూర్చుని తాగుతూ ఉండేవాడిని. జీవితం నా చేతుల్లోంచి చేజారిపోయింది. చచ్చిపోవాలనుకున్నాను. తర్వాత నా పరిస్థితి తెలుసుకుని స్నేహితులే నన్ను ఆ బాధ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆరేడునెలలపాటు నన్ను ఏ రోజూ ఒంటరిగా వదిలేయలేదు.

ఆటోలోనే షూటింగ్‌కు..
ఏడేళ్ల క్రితం నేను మళ్లీ పెళ్లి చేసుకున్నాను. నా భార్య నాకెంతో సపోర్ట్‌గా నిలబడింది. కరోనా సమయంలో అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. నా ఫ్రెండ్స్‌ వల్లే అమ్మ ఈరోజు జీవించి ఉంది. ఇప్పుడు నాకు కారు కూడా లేదు. ఆటో, బస్సుల్లోనే షూటింగ్స్‌కు వెళ్తున్నాను అని చెప్పుకొచ్చాడు. భగత్‌.. మలర్వాడి ఆర్ట్స్‌ క్లబ్‌, మాస్టర్స్‌, ఉస్తాద్‌ హోటల్‌, ఆడు 2, గూడలోచన, మందారం, ఉయరె, ఫోనిక్స్‌, గెట్‌ సెట్‌ బేబీ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించాడు.

చదవండి:  ముక్కలైన జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నా: హంసనందిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement