వాళ్లు 11 మందే అయినా.. 1,100 మందితో సమానం | Pawan Kalyan on YSRCP MLAs in the Legislative Assembly | Sakshi
Sakshi News home page

వాళ్లు 11 మందే అయినా.. 1,100 మందితో సమానం

Mar 7 2026 4:40 AM | Updated on Mar 7 2026 4:40 AM

Pawan Kalyan on YSRCP MLAs in the Legislative Assembly

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ 

సాక్షి, అమరావతి: శాసనసభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 11 మందే అయినా 1,100 మందితో సమానమన్నట్లు మాట్లాడుతారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా ఉండకపోతే వైఎస్సార్‌సీపీ బలపడుతుందని స్పష్టం చేశారు. 

‘వైఎస్సార్‌సీపీ వాళ్లు చెప్పిన దానిని చాలా బలంగా నమ్ముతారు. కానీ, మనం చేసే పనులు మనం చెప్పుకోలేం. ఎందుకు సంకోచిస్తున్నామో తెలీదు. మనలో (కూటమి) ఏకాభిప్రాయం, ఏకత్వం ఉండాలి. వైఎస్సార్‌సీపీ వాళ్లను ఎదుర్కోవాలంటే కూటమి సభ్యులు చాలా బలంగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement