రహస్య పోలీస్‌ | Makers released the title promo of Mogudu | Sakshi
Sakshi News home page

రహస్య పోలీస్‌

Mar 9 2026 1:20 AM | Updated on Mar 9 2026 9:36 AM

Makers released the title promo of Mogudu

‘ఆంబళ, మద గద రాజా’ చిత్రాల తర్వాత హీరో విశాల్, దర్శకుడు సుందర్‌ .సి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా సినిమా ‘మొగుడు’. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, సంపత్, అజయ్‌ ఘోష్, గరుడ రామ్, వీటీవీ గణేశ్,  యోగిబాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. డా. ఏసీ షణ్ముఖం ఆశీస్సులతో అరుణ్‌ కుమార్, ఖుష్బూ సుందర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ముగిసింది.

కోల్‌కత్తా, గోవా, చెన్నై లొకేషన్స్‌లో తదుపరి షెడ్యూల్స్‌ జరగనున్నాయి. ఇక ఇటీవల ‘మొగుడు’ సినిమా టైటిల్‌ ప్రోమోను మేకర్స్‌ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమోలో ఓ సాధారణ భర్తలా ఇంట్లో అన్ని పనులు చేస్తూనే, ఓ అండర్‌కవర్‌ పోలీస్‌లా రౌడీలను చితక్కొట్టేశారు విశాల్‌. ఈ సినిమాకు సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement