వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో మెరుగైన రాబడులు అందించేలా హైబ్రిడ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్‌ను ది వెల్త్ కంపెనీ ఏఎంసీ ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ నవంబర్ 19న ప్రారంభమై డిసెంబర్ 3న ముగుస్తుంది. ఇది ప్రధానంగా ఈక్విటీ, డెట్, కమోడిటీల్లో (వెండి, పసిడి) ఇన్వెస్ట్ చేస్తుంది.
అనిశ్చితి నెలకొన్నప్పుడు, ద్రవ్యోల్బణం నుంచి హెడ్జింగ్ కోసం 50 శాతం వరకు కమోడిటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంపరంగా హైబ్రిడ్ ట్యాక్సేషన్ ప్రయోజనాలు ఉంటాయి.


