వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఇప్పటికే.. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
విన్‌ఫాస్ట్ 2026 ద్వితీయార్థంలో.. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. వీటిని కూడా కంపెనీ తమిళనాడులోని ప్లాంట్ నుంచి మార్కెట్‌కు సరఫరా చేయనుంది. మన దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ అంచెలంచెలుగా విస్తరిస్తున్న తరుణంలో.. ఆ విభాగంలో సంస్థ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సంస్థ సంకల్పించింది.
విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు
విన్‌ఫాస్ట్ VF6: విన్‌ఫాస్ట్ వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు.. ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది స్ప్లిట్ హెడ్‌లైట్, టెయిల్‌లైట్ సెటప్‌లు పొందుతుంది. లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు.. కొత్త ఫీచర్స్ పొందుతుంది. మూడు ట్రిమ్ (ఎర్త్, విండ్, ఇన్ఫినిటీ) లెవెల్స్‌లో అందుబాటులో ఉన్న ఈ కారు 59.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఎర్త్ వేరియంట్ 468 కిమీ రేంజ్ అందిస్తుంది. మిగిలిన రెండూ కూడా 463 కిమీ రేంజ్ అందిస్తాయి.
విన్‌ఫాస్ట్ VF7: టేపింగ్ రూఫ్‌లైన్, యాంగ్యులర్ రియర్ విండ్‌షీల్డ్‌తో స్ట్రీమ్‌లైన్డ్ ప్రొఫైల్ కలిగిన విన్‌ఫాస్ట్ వీఎఫ్7, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటివి పొందుతుంది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు 59.6 కిలోవాట్, 70.8 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలను పొందుతుంది. రేంజ్ అనేది వరుసగా 438 కిమీ, 532 కిమీ వరకు ఉంది.


