breaking news
VinFast
-
మార్కెట్లో కొత్త వియాత్నం కార్లు: ధరలు ఇలా..
వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు.. విన్‌ఫాస్ట్ తన రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు VF6, VF7 ధరలను ప్రకటించింది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 16.49 లక్షలు, రూ. 20.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ రెండు మోడళ్లను తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న కంపెనీ కొత్త ప్లాంట్‌లో స్థానికంగా అసెంబుల్ చేస్తారు. సంస్థ వీటికోసం జులై 15 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.విన్‌ఫాస్ట్ VF6విన్‌ఫాస్ట్ వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు.. ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. ఇది స్ప్లిట్ హెడ్‌లైట్, టెయిల్‌లైట్ సెటప్‌లు పొందుతుంది. లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు.. కొత్త ఫీచర్స్ పొందుతుంది. మూడు ట్రిమ్ (ఎర్త్, విండ్, ఇన్ఫినిటీ) లెవెల్స్‌లో అందుబాటులో ఉన్న ఈ కారు 59.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఎర్త్ వేరియంట్ 468 కిమీ రేంజ్ అందిస్తుంది. మిగిలిన రెండూ కూడా 463 కిమీ రేంజ్ అందిస్తాయి.ఇదీ చదవండి: రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!విన్‌ఫాస్ట్ VF7టేపింగ్ రూఫ్‌లైన్, యాంగ్యులర్ రియర్ విండ్‌షీల్డ్‌తో స్ట్రీమ్లైన్డ్ ప్రొఫైల్ కలిగిన విన్‌ఫాస్ట్ వీఎఫ్7, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటివి పొందుతుంది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు 59.6 కిలోవాట్, 70.8 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలను పొందుతుంది. రేంజ్ అనేది వరుసగా 438 కిమీ, 532 కిమీ వరకు ఉంది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న వియాత్నం బ్రాండ్ కార్లు.. ఇవే
వియాత్నం కంపెనీ విన్‌ఫాస్ట్.. భారతదేశంలో తన VF6, VF7 ఎలక్ట్రిక్ కార్లను 2025 సెప్టెంబర్ 6న ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది. 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ఈ కార్లు త్వరలోనే రోడ్డుపై కనిపించనున్నాయి. కాగా కంపెనీ ఈ కార్ల కోసం ఫ్రీ-బుకింగ్‌లను జులై 15 నుంచి స్వీకరించనున్నట్లు సమాచారం. వినియోగదారులు రూ. 21,000 రీఫండబుల్ డిపాజిట్ ద్వారా ఆన్లైన్లో లేదా విన్‌ఫాస్ట్ అవుట్లెట్లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీని కోరుకునే భారతీయ కొనుగోలుదారులను.. లక్ష్యంగా చేసుకుని విన్‌ఫాస్ట్ VF6 & VF7 లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ కార్లు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కలిగి ఉంటాయని, పనోరమిక్ గ్లాస్ రూఫ్లను కూడా పొందుతాయని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారువిన్ఫాస్ట్ తన సేల్స్, సర్వీస్, స్పేర్స్ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో భాగంగా.. ఢిల్లీ, బెంగళూరు, పూణే, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన కేంద్రాలతో సహా 27 నగరాల్లో 32 షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి 13 డీలర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. అంతే కాకుండా ఛార్జింగ్ స్టేషన్స్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి.. కంపెనీ రోడ్‌గ్రిడ్, మైటీవీఎస్, గ్లోబల్ అష్యూర్లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. -
విన్‌ఫాస్ట్ కార్ల కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫైనాన్సింగ్
న్యూఢిల్లీ: ఇన్వెంటరీ, ఆటో ఫైనాన్సింగ్ సదుపాయం కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు విన్‌ఫాస్ట్ ఆటో ఇండియా తెలిపింది. దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. భారత్‌లో ఒక బ్యాంకింగ్ సంస్థతో కుదర్చుకున్న తొలి ఎంఓయూ ఇది.నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలకు ముందు ఎలాంటి అంతరాయాలు లేని రుణ సదుపాయాలు అందించడం ఈ ఒప్పంద లక్ష్యమని కంపెనీ వివరించింది. భారతీయ కస్టమర్లకు సౌకర్యవంతమైన, ఆధునాతన ఎలక్ట్రిక్ వాహనాలను అందించే ప్రయత్నాల్లో ఈ ఎంఓయూ మైలురాయిగా నిలుస్తుందని విన్‌ఫాస్ట్ ఇండియా సీఈఓ ఫామ్ సాన్ చౌ తెలిపారు.‘ఈవీల వినియోగం పెరుగుతున్న క్రమంలో ఫైనాన్సింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. కస్టమర్ల ఆకాంక్షలకు పెద్దపీట వేయడంలో బ్యాంకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగం’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు రిటైల్ అసెట్స్ హెడ్ అరవింద్ వోహ్రా తెపారు. విన్‌ఫాస్ట్ ఆటో ఇండియా ఈ ఏడాది పండుగ సీజన్ ముందు వీఎఫ్7, వీఎఫ్6 మోడళ్లను లాంచ్ చేయనుంది.