
న్యూఢిల్లీ: ఇన్వెంటరీ, ఆటో ఫైనాన్సింగ్ సదుపాయం కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు విన్‌ఫాస్ట్ ఆటో ఇండియా తెలిపింది. దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. భారత్‌లో ఒక బ్యాంకింగ్ సంస్థతో కుదర్చుకున్న తొలి ఎంఓయూ ఇది.
నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలకు ముందు ఎలాంటి అంతరాయాలు లేని రుణ సదుపాయాలు అందించడం ఈ ఒప్పంద లక్ష్యమని కంపెనీ వివరించింది. భారతీయ కస్టమర్లకు సౌకర్యవంతమైన, ఆధునాతన ఎలక్ట్రిక్ వాహనాలను అందించే ప్రయత్నాల్లో ఈ ఎంఓయూ మైలురాయిగా నిలుస్తుందని విన్‌ఫాస్ట్ ఇండియా సీఈఓ ఫామ్ సాన్ చౌ తెలిపారు.
‘ఈవీల వినియోగం పెరుగుతున్న క్రమంలో ఫైనాన్సింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. కస్టమర్ల ఆకాంక్షలకు పెద్దపీట వేయడంలో బ్యాంకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగం’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రిటైల్ అసెట్స్ హెడ్ అరవింద్ వోహ్రా తెపారు. విన్‌ఫాస్ట్ ఆటో ఇండియా ఈ ఏడాది పండుగ సీజన్ ముందు వీఎఫ్7, వీఎఫ్6 మోడళ్లను లాంచ్ చేయనుంది.