చైనా కంపెనీతో ఏర్పాటు చేసిన లువోక్సిన్ ఆరోవిటాస్ జాయింట్ వెంచర్‌లో అదనంగా 20 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. ఇందుకోసం 5.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 46 కోట్లు) వెచి్చంచనున్నట్లు వివరించింది.
దీనికోసం భాగస్వామి షాన్‌డాంగ్ లువోక్సిన్ ఫార్మా గ్రూప్‌తో తమ అనుబంధ సంస్థ హెలిక్స్ హెల్త్‌కేర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. మూడు నెలల వ్యవధిలో ఈ లావాదేవీ ముగియనుంది. జేవీలో హెలిక్స్‌కి 30 శాతం, షాన్‌డాంగ్‌కి 70 శాతం వాటాలు ఉన్నాయి. 2029 నాటికి 18.86 మిలియన్ డాలర్లతో మిగతా 50 శాతం వాటాను అరబిందో ఫార్మా కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉంది.


