ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫామ్ ప్రిజమ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వాటాదారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో ఇందుకు అనుగుణంగా ఓటు వేసినట్లు ఓయో బ్రాండ్ కంపెనీ ప్రిజమ్ పేర్కొంది.
ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు వాటాదారులు ఆమోదించినట్లు వెల్లడించింది. వెరసి తగిన సమయంలో లిస్టింగ్ సన్నాహాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది.
ఈ ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో భాగాన్ని అప్పుల తగ్గింపు, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ బలోపేతం, కొత్త మార్కెట్ల విస్తరణతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు సూచించాయి. మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన అనంతరం డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసి, ఇష్యూ టైమ్‌లైన్‌ను ఖరారు చేయనున్నట్లు తెలిపాయి.


