ఏఐతో టెక్‌ సర్వీసుల్లో సరికొత్త మార్పులు | AI to Bring Transformational Changes in Tech Services NASSCOM | Sakshi
Sakshi News home page

ఏఐతో టెక్‌ సర్వీసుల్లో సరికొత్త మార్పులు

Feb 8 2026 8:21 AM | Updated on Feb 8 2026 12:10 PM

AI to Bring Transformational Changes in Tech Services NASSCOM

న్యూఢిల్లీ: అధునాతన కృత్రిమ మేథ (ఏఐ) రాకతో దేశీ టెక్నాలజీ సరీ్వసుల రంగంలో విపత్కర పరిణామాలు ఉంటాయన్న ఆందోళనలను ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ తోసిపుచ్చింది. ఇది పరిశ్రమను సరికొత్తగా తీర్చిదిద్దుతుందని పేర్కొంది. దేశీ ఐటీ కంపెనీలు సంక్లిష్టమైన టెక్నాలజీలపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తుంటాయని వివరించింది.

ఏఐ నుంచి సిసలైన ప్రయోజనాలు పొందాలంటే మనుషులతో కూడా సమన్వయం చేసుకోవడం కీలకంగా ఉంటుందని తెలిపింది. వారికి పరిశ్రమపైన, నిర్దిష్ట వ్యాపారాలపైన లోతైన అవగాహన అవసరమని నాస్కామ్‌ పేర్కొంది. ఏఐని ప్రయోగాత్మకంగా పరీక్షించడం నుంచి భారీ స్థాయిలో వినియోగంలోకి తేవడం వైపు మళ్లించడంలో టెక్నాలజీ సేవల సంస్థలు తోడ్పడతాయని వివరించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement