breaking news
shareholders approved
-
ఓయో ఐపీవోకు వాటాదారులు ఓకే
ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫామ్ ప్రిజమ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వాటాదారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో ఇందుకు అనుగుణంగా ఓటు వేసినట్లు ఓయో బ్రాండ్ కంపెనీ ప్రిజమ్ పేర్కొంది.ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు వాటాదారులు ఆమోదించినట్లు వెల్లడించింది. వెరసి తగిన సమయంలో లిస్టింగ్ సన్నాహాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది.ఈ ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో భాగాన్ని అప్పుల తగ్గింపు, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ బలోపేతం, కొత్త మార్కెట్ల విస్తరణతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు సూచించాయి. మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన అనంతరం డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసి, ఇష్యూ టైమ్‌లైన్‌ను ఖరారు చేయనున్నట్లు తెలిపాయి. -
మారుతీ చేతికి గుజరాత్ ప్లాంట్
న్యూఢిల్లీ: మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ)కు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల జారీకి వాటాదారులు అనుమతించినట్లు మారుతీ సుజుకీ ఇండియా తాజాగా వెల్లడించింది. దీంతో సంబంధిత పార్టీ లావాదేవీకింద సుజుకీ మోటార్ గుజరాత్(ఎస్ఎంజీ)లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకుగాను రెండు ప్రత్యేక అంశాలపై పోస్టల్ బ్యాలట్ ద్వారా మారుతీ గత నెలలో వాటాదారుల నుంచి అనుమతిని కోరింది. రెండు సంస్థల మధ్య ఒప్పందం(సంబంధిత పార్టీ లావాదేవీ)తోపాటు.. నగదుకాకుండా ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల కేటాయింపుపై ఓటింగ్‌కు తెరతీసింది. ఈ రెండు అంశాలకూ వాటాదారుల నుంచి 98 శాతానికిపైగా అనుకూలంగా ఓట్లు లభించినట్లు మారుతీ తాజాగా వెల్లడించింది. గత నెలలో రూ. 12,841 కోట్లకు ఎస్ఎంజీని కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుకీ దాదాపు రూ. 10,241 ధరలో మొత్తం 1.23 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి ఆమోదముద్ర వేసింది. వెరసి ఎస్‌ఎంజీలో 100 శాతం వాటాను సొంతం చేసుకునే బాటలో ప్రిఫరెన్షియల్ జారీకి మారుతీ బోర్డు తెరతీసింది. ఈ లావాదేవీతో మారుతీలో ఎస్‌ఎంసీకిగల వాటా 56.4 శాతం నుంచి 58.28 శాతానికి బలపడనుంది. మరోవైపు ఎస్ఎంజీ మారుతీకి పూర్తి అనుబంధ కంపెనీగా ఆవిర్భవించనుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.50వేల కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో గృహాలు, మౌలిక వసతుల రంగానికి రుణాలు అందించేందుకు వీలుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.50వేల కోట్ల నిధుల సమీకరణకు వాటాదార్ల అనుమతి కోరనుంది. డెట్ ఇనుస్ట్రుమెంట్స్, టైర్-2 కేపిటల్ బాండ్స్, సీనియర్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్‌ను దేశీయ మార్కెట్లో ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.50వేల కోట్లకు మించకుండా నిధులు సేకరించాలని బ్యాంకు డెరైక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది.


