
వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు.. విన్‌ఫాస్ట్ తన రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు VF6, VF7 ధరలను ప్రకటించింది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 16.49 లక్షలు, రూ. 20.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ రెండు మోడళ్లను తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న కంపెనీ కొత్త ప్లాంట్‌లో స్థానికంగా అసెంబుల్ చేస్తారు. సంస్థ వీటికోసం జులై 15 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.
విన్‌ఫాస్ట్ VF6
విన్‌ఫాస్ట్ వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు.. ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది స్ప్లిట్ హెడ్‌లైట్, టెయిల్‌లైట్ సెటప్‌లు పొందుతుంది. లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు.. కొత్త ఫీచర్స్ పొందుతుంది. మూడు ట్రిమ్ (ఎర్త్, విండ్, ఇన్ఫినిటీ) లెవెల్స్‌లో అందుబాటులో ఉన్న ఈ కారు 59.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఎర్త్ వేరియంట్ 468 కిమీ రేంజ్ అందిస్తుంది. మిగిలిన రెండూ కూడా 463 కిమీ రేంజ్ అందిస్తాయి.
ఇదీ చదవండి: రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!
విన్‌ఫాస్ట్ VF7
టేపింగ్ రూఫ్‌లైన్, యాంగ్యులర్ రియర్ విండ్‌షీల్డ్‌తో స్ట్రీమ్‌లైన్డ్ ప్రొఫైల్ కలిగిన విన్‌ఫాస్ట్ వీఎఫ్7, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటివి పొందుతుంది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు 59.6 కిలోవాట్, 70.8 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలను పొందుతుంది. రేంజ్ అనేది వరుసగా 438 కిమీ, 532 కిమీ వరకు ఉంది.