హార్లే డేవిడ్సన్ కొత్త బైక్: ధర ఎంతో తెలుసా? | Harley Davidson X440 T Launched At Rs 2 79 Lakh | Sakshi
Sakshi News home page

హార్లే డేవిడ్సన్ కొత్త బైక్: ధర ఎంతో తెలుసా?

Dec 7 2025 10:28 PM | Updated on Dec 7 2025 10:29 PM

Harley Davidson X440 T Launched At Rs 2 79 Lakh

హీరో మోటోకార్ప్ & హార్లే-డేవిడ్సన్ కంపెనీలు అభివృద్ధి చేసిన బైకులను ఎప్పటికప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తూ.. ప్రజాదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా HD X440 T పేరుతో ఓ బైక్ లాంచ్ చేశాయి. దీని ధర రూ. 2.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

నలుపు, ఎరుపు, నీలం & తెలుపు అనే నాలుగు రంగులలో లభించే ఈ లేటెస్ట్ హార్లే-డేవిడ్సన్ హెచ్డీ ఎక్స్440 టీ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

కొత్త డిజైన్ కలిగిన ఈ బైకులో 440cc, సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 27hp & 38Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఎంపికలో లభిస్తుంది. ఈ బైక్ ప్రత్యేకంగా రైడ్-బై-వైర్, రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్‌ వంటివి పొందుతుంది. రియర్ సబ్‌ఫ్రేమ్ కొత్త టెయిల్ సెక్షన్‌ పొందుతుంది. గ్రాబ్ హ్యాండిల్స్ & పొడవైన సీటు వంటివి రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని ఇస్తాయి.

ఇదీ చదవండి: జనవరి నుంచి ఈ కారు ధరల పెంపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement