
వియాత్నం కంపెనీ విన్‌ఫాస్ట్.. భారతదేశంలో తన VF6, VF7 ఎలక్ట్రిక్ కార్లను 2025 సెప్టెంబర్ 6న ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది. 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ఈ కార్లు త్వరలోనే రోడ్డుపై కనిపించనున్నాయి. కాగా కంపెనీ ఈ కార్ల కోసం ఫ్రీ-బుకింగ్‌లను జులై 15 నుంచి స్వీకరించనున్నట్లు సమాచారం. వినియోగదారులు రూ. 21,000 రీఫండబుల్ డిపాజిట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా విన్‌ఫాస్ట్ అవుట్‌లెట్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.
ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీని కోరుకునే భారతీయ కొనుగోలుదారులను.. లక్ష్యంగా చేసుకుని విన్‌ఫాస్ట్ VF6 & VF7 లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ కార్లు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కలిగి ఉంటాయని, పనోరమిక్ గ్లాస్ రూఫ్‌లను కూడా పొందుతాయని కంపెనీ వెల్లడించింది.
ఇదీ చదవండి: ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారు
విన్‌ఫాస్ట్ తన సేల్స్, సర్వీస్, స్పేర్స్ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో భాగంగా.. ఢిల్లీ, బెంగళూరు, పూణే, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన కేంద్రాలతో సహా 27 నగరాల్లో 32 షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి 13 డీలర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. అంతే కాకుండా ఛార్జింగ్ స్టేషన్స్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి.. కంపెనీ రోడ్‌గ్రిడ్, మైటీవీఎస్, గ్లోబల్ అష్యూర్‌లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది.