కార్ల తయారీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ యూటిలిటీ వెహికల్ (CUV) ఎంజీ విండ్సర్ అమ్మకాలు కీలక మైలురాయి చేరుకున్నట్లు ప్రకటించింది. కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలు పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది. గణాంకాల ప్రకారం ప్రతి గంటకు సగటున 5 యూనిట్ల ఎంజీ విండ్సర్ కార్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఇది కంపెనీకి చారిత్రక విజయాన్ని సూచించడమే కాకుండా, భారతదేశంలో ఈవీ విభాగంలో అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న మొదటి ఈవీగా విండ్సర్ నిలిచిందని కంపెనీ తెలిపింది.
ఈ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ..‘విండ్సర్ ఈవీని ప్రారంభించినప్పుడు వినియోగదారులకు స్టైలిష్, విలువ ఆధారిత మొబిలిటీ సొల్యూషన్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విండ్సర్ ఈవీ వేగంగా విజయం సాధించింది. రికార్డు సమయంలో 50,000 అమ్మకాలను చేరింది. ఈ విజయం న్యూ ఎనర్జీ వాహనాల పట్ల కంపెనీ నిబద్ధతను మరింతగా పెంచుకోవడానికి శక్తినిస్తుంది’ అన్నారు. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తయారు చేసిన పరిమిత ఎడిషన్ సిరీస్ ఎంజీ విండ్సర్ ఇన్‌స్పైర్‌ను ఇటీవల భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు.
ఎంజీ విండ్సర్ ఫీచర్లు
ఈ కారు 100 KW శక్తిని 200 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. దీని ప్రారంభ BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫ్యూచరిస్టిక్ ఏరోగ్లైడ్ డిజైన్‌తో పాటు 135 డిగ్రీల వరకు వాలే ఏరో లాంజ్ సీట్లు ఉన్నాయి.
ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!


