breaking news
Windsor Castle
-
బ్రిటన్ రాజు గారింట్లో దొంగలు పడ్డారు!
బ్రిటన్‌లో రాజు గారింట్లో దొంగలు పడ్డారు! రాజు చార్లెస్–3 దంపతులకు చెందిన విండ్సర్ రాజప్రాసాదంలో ఒక పికప్ ట్రక్కును, బైకును ఎత్తుకెళ్లారు. గత అక్టోబర్ 13న అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఉదంతాన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్ సన్ తాజాగా బయటపెట్టింది. ‘‘ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆరడుగుల ఫెన్స్‌ను దూకి మరీ ప్యాలెస్ లోనికి పవ్రేశించారు. దొంగిలించిన ట్రక్కుతోనే సెక్యూరిటీ గేట్‌ను బద్దలు కొట్టి మరీ దర్జాగా ఉడాయించారు’’ అని తెలిపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాసాదంలోకి దొంగలు సులువుగా ప్రవేశించడమే గాక సెక్యూరిటీ సిబ్బంది కన్నుగప్పి ఏకంగా వాహనాలనే ఎత్తుకుపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రాసాదం పరిధిలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయతి్నస్తే వెంటనే అలారం మోగుతుంది. చోరీ జరిగిన రోజు అలారం, ఇతర రక్షణ వ్యవస్థలన్నీ ఏమయ్యాయన్నది అంతుచిక్కడం లేదు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. లండన్‌కు పాతిక మైళ్ల దూరంలో బెర్క్‌షైర్‌లో ఉండే విండ్సర్ క్యాజిల్‌లో రాజ దంపతులు వారానికి రెండు రోజులు బస చేస్తారు. యువరాజు విలియం, కేట్ దంపతులు కూడా తమ పిల్లలతో కలిసి దాని ఆవరణలోని అడెలైడ్ కాటేజీలోనే నివాసముంటారు. చోరీ జరిగినప్పుడు రాజ దంపతులు భవనంలో లేకున్నా విలియం దంపతులు తమ కాటేజీలోనే ఉన్నట్టు సమాచారం. దొంగలు బద్దలు కొట్టుకుని ఉడాయించిన గేటు గుండానే రాజ దంపతులు రాకపోకలు సాగుతాయని చెబుతున్నారు. ఈ ఉదంతంపై స్పందించేందుకు బకింగ్‌హాం ప్యాలెస్ నిరాకరించింది. బ్రిటన్ రాజ దంపతులతో పాటు రాజ కుటుంబీకులకు సొంత పోలీసు భద్రతా వ్యవస్థ ఉంటుంది. వారి భద్రతపై ఏటా కోట్లాది రూపాయలు వెచి్చస్తారు.గతంలో ఎలిజబెత్‌పై హత్యాయత్నం విండ్సర్ క్యాజిల్‌లో భద్రతా లోపాలు తలెత్తడం ఇది తొలిసారేమీ కాదు. 2021లో ఈ ప్రాసాదంలోనే రాణి ఎలిజబెత్–2పై హత్యా యత్నం జరిగింది. ఒక సాయుధుడు క్రిస్మస్ రోజు ఏకంగా ఫెన్సింగ్ దూకి లోనికి చొరబడ్డాడు. సునాయాసంగా రాణిని సమీపించాడు. అతన్ని చూసి భయంతో ఆమె చాలాసేపు కేకలు వేసినట్టు చెబుతారు. చివరికి భద్రతా సిబ్బంది దుండగున్ని బంధించడంతో ముప్పు తప్పింది. అప్పట్లో రాణి విండ్సర్లోనే నివాసముండేవారు. సాయుధుడు అంత సులువుగా రాణి సమీపం దాకా వెళ్లగలగడం, పైగా ఆ సమయంలో దగ్గర్లో భద్రతా సిబ్బంది లేకపోవడం అప్పట్లో చాలా అనుమానాలకు తావిచి్చంది. -
ప్రిన్స్ ఫిలిప్‌కు గన్ సెల్యూట్
లండన్: విండ్సర్ కోటలో శుక్రవారం కన్నుమూసిన రాణి ఎలిజెబెత్–2 భర్త, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరో ప్రిన్స్ ఫిలిప్(99)కు సంతాప సూచికంగా గన్ సెల్యూట్ చేశారు. 8 రోజుల సంతాప ప్రారంభ సూచికగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోని రాజధానులు లండన్, కార్డిఫ్, బెల్ఫాస్ట్, ఎడిన్బరోలలో శనివారం మధ్యాహ్నం నిమిషానికి ఒక రౌండ్ చొప్పున 41 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దేశవ్యాప్తంగా ఇలా గన్ సెల్యూట్ చేసే జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఈ కార్యక్రమం 18వ శతాబ్దం నుంచి ఆనవాయితీగా వస్తోందని రాయల్ వెబ్సైట్ తెలిపింది. ఇలాంటి గన్ సెల్యూట్ రాణి విక్టోరియా చనిపోయిన సమయంలో 1901లోనూ పాటించారని వివరించింది. రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరోకు రాయల్ నేవీతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని గన్ సెల్యూట్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపింది. గన్ సెల్యూట్ కార్యక్రమాలు ఆన్‌లైన్‌తోపాటు టీవీల్లోనూ ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. పార్లమెంట్ కొత్తగా ఎలాంటి చట్టాలు చేయదు. సంప్రదాయం ప్రకారం, రాణి ఎలిజెబెత్ ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనరు. కొత్తగా ఎలాంటి చట్టాలను ప్రభుత్వం ఆమె ఆమోదం కోసం పంపించదు. డ్యూక్ జీవిత కాలాన్ని ప్రతిబింబిస్తూ అబ్బేలోని టెనోర్ బెల్‌ను శుక్రవారం సాయంత్రం 6 గంటలు మొదలుకొని నిమిషానికి ఒకసారి చొప్పున 99 పర్యాయాలు మోగించనున్నారు. రాయల్ సెరిమోనియల్ ఫ్యూనె రల్ పూర్తి వివరాలు త్వరలో ఖరారు కానున్నాయి. -
బ్రిటన్ రాణి దంపతులకు కోవిడ్ టీకా
లండన్ : బ్రిటన్ రాణి ఎలిజెబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్‌కు కోవిడ్–19 వ్యాక్సిన్ ఇచ్చారు. విండ్సర్ కేజల్‌లో ఉంటున్న రాణి దంపతులకు ఫ్యామిలీ డాక్టర్ శనివారం నాడు కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్టుగా బకింగ్çహామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. రాణి, రాజు వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను బయట ప్రపంచానికి వెల్లడించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎలాంటి ఊహాగానాలకు తావుండ కూడదని తామిద్ద్దరికీ వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా మహారాణియే స్వయంగా ప్రజలందరికీ వెల్లడించమన్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఎలిజెబెత్ వయసు 94 కాగా, ఫిలిప్ వయసు 99 సంవత్సరాలు. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్‌తో వణికిపోతున్న బ్రిటన్‌లో ఇప్పటివరకు 15 లక్షల మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చారు. బ్రిటన్‌లో 80 ఏళ్లు పైబడిన వారికి తొలి ప్రాధాన్యంగా టీకా ఇస్తున్నారు. అయితే రాణి దంపతులకి ఏ కంపెనీ వ్యాక్సిన్ ఇచ్చారో తెలియలేదు. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ప్రస్తుతం బ్రిటన్‌లో ఇస్తున్నారు. -
నలుపు.. తెలుపు.. నేను
మెఘన్ 2011లో టెలివిజన్ సిరీస్ నిర్మాత ట్రెవర్ ఇంజెల్సన్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే విడాకులతో ఆ ఇద్దరూ ఆ బంధం నుంచి బయటకు వచ్చారు. 1992 అనుకుంటా... ఎలిమెంటరీ స్కూల్ అమ్మాయి. పదకొండేళ్లుంటాయి. స్కూల్ ఇంటర్వెల్ బ్రేక్‌లో టీవీ చూస్తోంది. కమర్షియల్ వస్తోంది ఆ టైమ్‌కి. రకరకాల వర్గాల్లోని ఆడవాళ్లు అంట్లుతోమడానికి గిన్నెలతో కుస్తీ పడుతున్నారు. అదే ట్యాగ్‌లైన్ ఆ యాడ్ కింద.. ‘‘అమెరికాలోని ఆడవాళ్లంతా జిడ్డోడుతున్న పాత్రలతో ఫైటింగ్ చేస్తున్నారు’’ అని! ఆ యాడే చూస్తున్న ఆమె క్లాస్మేట్స్ అబ్బాయిలిద్దరూ ‘‘ఆడవాళ్లు అంట్లతో కాక దేనితో కుస్తీ పడ్తారు?’’ అంటూ నవ్వారు హేళనగా. అమ్మాయి షాక్ అయింది. కోపమొచ్చింది. బాధా కలిగింది. అంట్లు తోమడం ఆడవాళ్ల పనేనా? ప్రశ్న ఆ చిన్న మెదడులో. మధ్యాహ్నం ఇంటికెళ్లే సరికి అది రొదలా మారింది. ఇంట్లో... నాన్నతో చెప్పింది పొద్దున తను చూసిన టీవీ కమర్షియల్.. క్లాస్మేట్స్ పాస్ చేసిన కామెంట్స్ గురించి. అంట్లు ఆడవాళ్లు మాత్రమే ఎందుకు తోమాలి? ఆ కమర్షియల్‌ను ఎందుకలా తీశారు? అన్నం అందరం తింటున్నప్పుడు అంట్లు తోమే బాధ్యతను కూడా అందరూ షేర్ చేసుకోవాలి కదా.. అది కేవలం ఆడవాళ్ల పనే అన్నట్లుగా ఎందుకు చూపిస్తున్నారు? అలా ప్రమోట్ చేయబట్టే కదా నా క్లాస్మేట్స్ ఆడవాళ్లను అంత తేలికగా చూశారు? ఎందుకు నాన్నా ఇలా? దీన్ని మార్చాలి.. ఏదైనా చేయాలి?’’ అంది చిన్న పిడికిలిని అంతే చిన్న అరచేతిలో నూరుతూ! తన బుజ్జి కూతురి గొప్ప ఆలోచనకు, ఆరాటానికి ముచ్చటపడ్డాడు. గర్వపడ్డాడు తండ్రి. ‘‘ఏదైనా చెయ్ మరి! పెద్దవాళ్లకు ఉత్తరం రాయు’’అని సలహా ఇచ్చాడు. ‘‘ రాస్తాను డాడ్’’ అంటూ తండ్రి మెడను రెండుచేతులతో చుట్టేసింది. ఆ క్షణం నుంచే పెద్దవాళ్లు ఎవరా అని ఆలోచించసాగింది అమ్మాయి. ఆ సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్ బిల్‌క్లింటన్. వెంటనే ఆ పిల్లకు ఫస్ట్‌లేడీ హిల్లరీ క్లింటన్ గుర్తొచ్చింది. అప్పుడు కిడ్స్ న్యూస్ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్న లిండా ఎల్లర్బీ, పవర్‌హౌజ్ అటార్ని గ్లోరియా ఆల్రెడ్లూ మనసులో మెదిలారు. ఆ ముగ్గురితోపాటు ఆ కమర్షియల్‌లో కనిపించిన అంట్లుతోమే లిక్విడ్ తయారు చేసే కంపెనీకీ రాసింది. నెల తర్వాత.. మళ్లీ ఆ కమర్షియల్ ప్రసారం అయింది. అయితే ఈసారి.. ‘‘అమెరికా ప్రజలంతా జిడ్డు, జిగురోడుతున్న అంట్లగిన్నెలతో కుస్తీపడుతున్నారు’’ అనే ట్యాగ్‌లైన్‌తో! పదకొండేళ్ల అమ్మాయి మొహంలో నవ్వు! విజయంతో కూడిన నవ్వు! కిడ్స్ న్యూస్ ప్రోగ్రామ్ చానల్ యాంకర్ ఆ చిన్నారి ఇంటి తలుపు తట్టింది చేతిలో మైక్, కెమెరా క్య్రూతో. ఆ పిల్ల ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం! ఆ అమ్మాయి.. హిల్లరీ, లిండా, గ్లోరియా, అంట్లుతోమే లిక్విడ్ సోప్ తయారుదారు ప్రాక్టర్ అండ్ గ్రాంబుల్కి.. థాంక్స్ చెప్పుకుంది! సమానత్వం అంటే ఓ మాట కాదు. స్త్రీ,పురుషులు ఇద్దరూ కలిసి సాధించే చేత! ఇది చర్చలకే పరిమితం కాకూడదు. కార్యాచరణకు రావాలి. ఓ పదకొండేళ్ల అమ్మాయి చేయగలిగింది ప్రపంచంలోని ఇంతమంది ప్రజలు చేయలేరా? ఈ భూమ్మీద స్త్రీ, పురుషులిద్దరూ సమానమనే ఆలోచనాధోరణిని అలవర్చుకోలేరా? సమానత్వం మీద మాటలు ఆపి యాక్షన్‌లోకి దిగుదాం అని ప్రపంచాన్ని కోరుతోంది నాటి పదకొండేళ్ల పిల్ల.. నేటి 36 ఏళ్ల యువతిగా! ఆమె... టెలివిజన్ నటి.. బ్రిటిష్ యువరాజు హ్యారీకి కాబోయే సతీమణి.. మెఘన్ మార్కల్! మెఘన్ బయోగ్రఫీ.. మెఘన్ మార్కల్ పుట్టిపెరిగింది అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, లాస్ఏంజెల్స్లో. తల్లి డోరియా.. ఆఫ్రికన్ అమెరికన్. క్లినికల్ థెరపిస్ట్, యోగా ఇన్స్ట్రక్టర్. తండ్రి టామ్..తెల్లజాతీయుడు. సినిమాటోగ్రాఫర్. టామ్ ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్లో ఉన్నప్పుడు డోరియాను చూసి ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరి ప్రతిరూపంగా ఉంటుంది మెఘన్. తన పదకొండేళ్ల వయసులోనే జెండర్ ఇన్ ఈక్వాలిటీ మీద స్పందించి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ కమర్షియల్ యాడ్‌ను, ట్యాగ్‌లైన్‌నూ మార్చేసి అమెరికా దృష్టిని ఆకర్షించింది. అలా బాల్యంనుంచే పోరాటస్ఫూర్తితో ఉన్న మెఘన్ నార్త్‌వెస్ట్రన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్లో థియేటర్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో గ్రాడ్యూయేషన్ చేసింది. టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. జనరల్ హాస్పిటల్ అనే షోలో గెస్ట్‌రోల్‌తో బుల్లితెరంగేట్రం చేసింది. కట్స్, ది వార్ ఎట్ హోమ్, ఎన్వై అండ్ 90210 వంటి సిరీస్‌లో నటించింది. సూట్స్ అనే సిరీస్‌లో రాచెల్ జేన్‌తో ప్రపచమంతా సుపరిచితమైంది. గెట్ హిమ్ టు ద గ్రీక్, హారిబుల్ బాసెస్, యాంటీ సోషల్ వంటి సినిమాల్లోనూ నటించింది. బ్లాక్ అండ్ వైట్.. తల్లి బ్లాక్, తండ్రి వైట్ కావడం, సంప్రదాయవాదులున్న చోట బాల్యం గడవడం వల్ల ఆ వివక్షను చాలానే ఎదుర్కొంది మెఘన్. అది నటనా రంగంలోకి అడుగుపెట్టాక కూడా వెంటాడింది. అయితే ఎక్కడా తన ఐడెంటీటీ కల్పోలేదు. దీనికి కారణం చిన్నప్పుడు తన తండ్రి ఇచ్చిన ధైర్యమే అంటుంది ఆమె. సెవెంత్గ్రేడ్లో ఉన్నప్పుడు ఒకసారి.. ఇంగ్లిష్ క్లాస్‌లో తప్పక జవాబు చెప్పాల్సిన సెషన్ జరుగుతోంది. టీచర్ ఓ కాగితం ఇచ్చింది. విద్యార్థుల వివరాలను ఆ కాగితంలోని కాలమ్స్‌ను అనుసరించి నింపాలి. అందులో నలుపు, తెలుపు, లాటిన్ అమెరికన్, ఏషియన్ అని విద్యార్థుల గుర్తింపును సూచించే గడి కూడా ఉంది. ఆ నాలిగింట్లో పిల్లలు తాము ఏ ఉనికికి చెందిన వారైతే ఆ గడి దగ్గర టిక్ పెట్టాలి. మెఘన్ అన్నీ వివరాలు నింపి ఆ కాలమ్ దగ్గర ఆగిపోయింది. తల్లిలాంటి ఉంగరాల జుత్తు, తండ్రిలాంటి పాలిపోయిన తెలుపు ఒంటి రంగుతో ఉన్న తను ఆ మిశ్రమాన్ని ఏ గడిలో పెట్టాలో తెలియక ఏమీరాయకుండా లాగే ఉండిపోయింది. మెఘన్ అవస్థ గమనించిన టీచర్.. తెల్లగా ఉన్నావు కాబట్టి వైట్ దగ్గర టిక్ పెట్టు అని సలహా ఇచ్చింది. మరి అమ్మ పోలికలూ ఉన్నాయి కదా! వైట్‌ను తన ఉనికిగా చెప్పుకోవడానికి ఆ పిల్ల మనసు అంగీకరించలేదు. దాంతో ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలేసింది. దిగులు మొహంతో ఇంటికెళ్లింది. తండ్రి అడిగాడు ఏమైంది అని. చెప్పింది. ఈసారి అలాంటి సంకటం వస్తే.. సందేహపడకుండా.. నీ సొంత ఐడెంటీనే చెప్పు అన్నాడు దగ్గరకు తీసుకొని. ఆ మాటంటున్నప్పుడు తన కూతురి చిన్నమెదడు ఎంత అయోమయాన్ని అనుభవించిందో అర్థం చేసుకున్నాడు. అది సృష్టించిన వ్యవస్థ పట్ల కోపం అతని మొహాన్ని ఎర్రబర్చడం ఆ బిడ్డ దృష్టిలో పడకపోలేదు. సొంత ఐడెంటిటీ గురించి తండ్రి చెప్పిన మాట ఆ రోజు నుంచి మైండ్‌లో అచ్చేసుకుంది. జ్ఞానాన్ని మించిన శక్తి లేదు.. సాధికారతను మించిన ఐడెంటిటీ లేదని తెలుసుకుంది. తర్వాత సాధికారతనే తన గుర్తింపుగా మార్చుకుంది మెఘన్.అందుకే ‘నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనే వివరం చెప్పాల్సి వస్తే... స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ మిక్స్డ్ రేస్ ఉమన్’’ అని గర్వంగా చెప్తాను అంటుంది. నటన నుంచి రచన దాకా.. మెఘన్.. తన తల్లిలా యోగానిపుణరాలు. మంచి కుక్. ఎల్లే యూకే మ్యాగజైన్‌కు వ్యాసాలూ రాస్తుంది. తన లైఫ్‌స్టయిల్ బ్రాండ్ అయిన ‘ది టిగ్’కు ఎడిటర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించింది. సంఘసేవిక. యూఎన్ విమెన్స్ అడ్వకేట్. వరల్డ్ విజన్ కెనడాకు గ్లోబల్ అంబాసిడర్. కాలీగ్రాఫర్ కూడా. నటనలోకి వచ్చేముందు కాలిగ్రఫే ఆమెకు ఆదాయమార్గం. వెడ్డింగ్ ఇన్విటేషన్స్ రాసేది. జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి యూఎన్ఓతో కలిసి జెండర్ ఈక్వాలిటీ మీద ఎంతో కృషి చేసింది. పని పట్ల ఆమెకున్న అంకితభావానికి, నిబద్ధతకు అదే ప్రతీక. 2015, ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు మెఘన్ ప్రసంగం ప్రేక్షకులతో సహా యూఎన్ సెక్రటరీ జెనరల్ బాన్ కీ మూన్నూ అమితంగా ఆకట్టుకుంది. ఆయనతో సహా ఆ సభంతా ఇచ్చిన స్టాడింగ్ ఒవేషనే అందుకు నిదర్శనం. ప్రిన్స్ హ్యారీతో.. కెనడాలోని టొరంటోలో.. ఇన్విక్టస్ గేమ్స్ జరుగుతున్నాయి. హాజరుకావడానికి వచ్చాడు ప్రిన్స్ హ్యారీ. మెఘన్ నటించిన ‘సూట్స్’ షూటింగ్ అయిందీ అక్కడే. అలా ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. డేటింగ్ స్టార్ట్ అయింది. ప్రేమ ఫిక్స్ అయింది. వీరి రొమాన్స్ ఆన్లైన్లో షికారూ చేసింది. 2017, నవంబర్ తొలినాళ్లలో తమ నిశ్చితార్థం జరిగిపోయినట్లు’ నవంబర్ నెల ఆఖరున ప్రకటించారు ప్రిన్స్ హ్యారీ, మెఘన్ మార్కల్. ఆ తర్వాత కొన్ని వారాలకు.. ‘‘2018, మే 19న ప్రిన్స్ హ్యారీకి, మెఘన్ మార్కల్‌కు వివాహం జరగనున్నట్టు కెన్సింగ్టన్ ప్యాలేస్ అనౌన్స్ చేసింది. విండ్సర్ కేసిల్లోని సెయింట్ జార్జెస్ చాపెల్ ఈ పెళ్లికి వేదికకానుంది. ‘‘రెఫ్యూజీ క్యాంప్స్ నుంచి రెడ్ కార్పెట్‌కి షిఫ్ట్ అయింది నా జీవితం. ఈ రెండు దశలనూ గౌరవిస్తాను. ఎందుకంటే ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. ఈ రెండూ నాకు ముఖ్యమే. నిజానికి అవసరం కూడా!’’ అంటుంది స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ మిక్స్డ్ రేస్ ఉమన్ మెఘన్ మార్కల్. – శరాది మేఘన్ మార్కల్ -
ఖర్చు అదుపు తప్పితే...రాణికైనా కష్టమే..
బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆమె మహారాణి. కానీ ఇపుడు ఆమె కుటుంబానికీ కష్టాలొచ్చాయి. ఖర్చులు తలకుమించిన భారంగా మారటంతో ఉన్న నిధులన్నీ కరిగిపోతున్నాయి. క్వీన్ ఎలిజబె త్ కుటుంబానికి ఏటా కోట్ల పౌండ్ల ఆదాయం వస్తున్నా.. ఖర్చు దానికన్నా ఎక్కువ ఉంటోంది. దాంతో ఏమవుతోందో తెలుసా? రాజభవనాలు శిధిలమైపోతున్నా రిపేరు చేయించటం లేదు. బకింగ్‌హామ్ ప్యాలెస్, విండ్సర్ క్యాజిల్ లాంటి భవంతులు పాడై... వర్షాలు కురిసినపుడల్లా కారిపోతున్నాయి. ఆ ప్యాలెస్‌లలో విలువైన కళాకృతులుండటంతో అవి చెడిపోకుండా వర్షాలు పడినప్పుడల్లా బకెట్లతో నీళ్లు పట్టి బయట పోస్తున్నారట. పాతకాలం నాటి బాయిలర్ల మెయింటెనెన్స్ ఖర్చులే ఏడాదికి 8 లక్షల పౌండ్ల దాకా ఉంటున్నాయట. 2012-13లో రాణిగారి కుటుంబ బడ్జెట్ 31 మిలియన్ పౌండ్లు కాగా... ఆమె సిబ్బంది మాత్రం ఏకంగా 51 మిలియన్ పౌండ్లు ఖర్చు చేశారట. దీంతో.. లోటు పూడ్చడానికి రాణిగారి రిజర్వ్ నిధిలోంచి మిగతా డబ్బు తీశారు. ఇలా ఏటా తీసేస్తుండటంతో 35 మిలియన్ పౌండ్లుండే రిజర్వ్ నిధి 1 మిలియన్ పౌండ్లకు తగ్గిపోయింది. ఈ లెక్కలన్నీ చూసిన బ్రిటన్ అకౌంట్ల కమిటీ... ఖర్చులు తగ్గించుకోకుంటే అంతే సంగతులంటూ క్వీన్ కుటుంబాన్ని హెచ్చరించింది. మీ ఖర్చులు చూసుకోండి... ఆర్థిక సలహాదారులు సరైన సలహాలివ్వకపోవడం వల్లే బ్రిటన్ రాణికి ఈ పరిస్థితి ఎదురైందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. మరి బ్రిటన్ రాణికే ఆర్థిక కష్టాలు తప్పనప్పుడు... సామాన్యులు అందుకు భిన్నం కాదు కదా!!. కావాలంటే రాణిగారిని బ్రిటన్ ప్రభుత్వం ఆదుకుంటుంది. కానీ మనల్ని ఏ ప్రభుత్వమూ ఆదుకోదు. తప్పదనుకుంటే తోబుట్టువులో, బంధుమిత్రులో కొంత సర్దుతారు. లేదంటే అదీ ఉండదు. కాబట్టి... రాబడి, ఖర్చుల లెక్కలు చేతిలో పెట్టుకుని మనం చూడాల్సిందేంటంటే... నా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నానా? అత్యవసరమైతే నా దగ్గర కనీసం 3 నెలలకు సరిపడా డబ్బులున్నాయా? లేదా? కాస్త కష్టపడితే అదనంగా ఆర్జించే మార్గాలేమైనా ఉన్నాయా? ఖర్చులు తగ్గించుకునే అవకాశాలేమైనా ఉన్నాయా? మునుపటి కన్నా ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉందా లేదా.?