జొమాటో వ్యవస్థాపకుడు & సీఈఓ దీపిందర్ గోయల్.. తన ఎక్స్ ఖాతాలో 'టెంపుల్' త్వరలో వస్తుందని ట్వీట్ చేశారు. ఏమిటీ టెంపుల్?, దీని ఉపయోగాలేమిటి అనే విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.
ఏమిటీ టెంపుల్?
టెంపుల్ అనేది "మెదడులో రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, నిజ సమయంలో & నిరంతరం లెక్కించడానికి ఉపయోగపడే పరికరం''. ఈ విషయాన్ని దీపిందర్ గోయల్ గతంలోనే వెల్లడించారు. ఈ పరికరానికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. గ్రావిటీ ఏజింగ్ పరికల్పనను పరిశోధించేటప్పుడు దీనిని అభివృద్ధి చేశారు.
నవంబర్ 15న చేసిన పోస్ట్‌లలో, గోయల్ దీనిని (టెంపుల్) శాస్త్రీయమైన అసాధారణమైన పరికల్పనను వివరించారు . "నేను దీన్ని ఎటర్నల్ సీఈఓగా పంచుకోవడం లేదు, ఒక వింత థ్రెడ్‌ను అనుసరించేంత ఆసక్తిగల తోటి మానవుడిగా షేర్ చేస్తున్నానని అన్నారు. గురుత్వాకర్షణ జీవితకాలాన్ని తగ్గిస్తుందని గోయల్ ఈ సిద్ధాంతాన్ని పరిచయం చేశారు.
Coming soon.
Follow @temple for more updates. pic.twitter.com/E7S8NeUDP4— Deepinder Goyal (@deepigoyal) December 7, 2025


