breaking news
Diversified giant
-
అంబానీ సామ్రాజ్యం స్థిరం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం ఫ్లాట్‌గా రూ. 18,645 కోట్లను తాకింది. ఇతర విభాగాలు పుంజుకున్నప్పటికీ గ్యాస్ ఉత్పత్తి క్షీణించడం, రిటైల్ బిజినెస్ నీరసించడం ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 18,540 కోట్లు ఆర్జించింది. కన్జూమర్ బిజినెస్ విడదీత, జీఎస్టీ క్రమబదీ్ధకరణ నేపథ్యంలో రిటైల్ బిజినెస్ ఆర్జన మందగించగా.. ఎనర్జీ, డిజిటల్ విభాగాలు మెరుగైన మార్జిన్లు సాధించాయి. కాగా.. మొత్తం ఆదాయం రూ. 2.43 లక్షల కోట్ల నుంచి రూ. 2.69 లక్షల కోట్లకు ఎగసింది. నిర్వహణ లాభం(ఇబిటా) 6 శాతం వృద్ధితో రూ. 48,003 కోట్లకు చేరింది. విభాగాల వారీగా రిలయన్స్ రిటైల్ నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 3,551 కోట్లను తాకింది. కొత్తగా 431 స్టోర్లను ప్రారంభించింది. ఆదాయం 8 శాతం ఎగసి రూ. 97,605 కోట్లకు చేరింది. జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 7,629 కోట్లకు చేరింది. త్రైమాసికవారీగా కస్టమర్ల సంఖ్య 50.64 కోట్ల నుంచి 51.53 కోట్లకు పెరిగింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 213.7 నుంచి రూ. 221.4కు బలపడింది. కేజీ ఫీల్డ్స్‌లో ఉత్పత్తి తగ్గడంతో ఇబిటా 13 శాతం క్షీణించి రూ. 4,857 కోట్లకు పరిమితమైంది. కేజీడీ6లో సగటున గ్యాస్ ఉత్పత్తి 26.1 ఎంఎస్సీఎండీకి చేరగా.. రోజుకి 18,400 బ్యారళ్ల చమురును వెలికితీసింది. జియోస్టార్ రూ. 8,010 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా రూ. 1,303 కోట్లుకాగా.. యాక్టివ్ యూజర్ల సంఖ్య 13 శాతం వృద్ధితో నెలవారీ 45 కోట్లను తాకింది. 2025 డిసెంబర్31కల్లా ఆర్ఐఎల్ నికర రుణ భారం రూ. 1.17 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో రూ. 33,286 కోట్ల పెట్టుబడి వ్యయాలను కవర్ చేసేలా రూ. 41,303 కోట్ల నగదు ఆర్జన సాధించింది. ఆర్ఐఎల్ షేరు ఫ్లాట్‌గా రూ.1,458 వద్ద ముగిసింది.ఓ2సీ, న్యూ ఎనర్జీపై దృష్టిఓ2సీ, న్యూ ఎనర్జీ బిజినెస్‌లలో వృద్ధికి వీలుగా ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులపై పెట్టుబడులను వెచి్చస్తున్నాం. అంతేకాకుండా జియో, రిటైల్ నెట్వర్క్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, పటిష్టతలకు పెట్టుబడి వ్యయాలను కేటాయిస్తున్నాం. వివిధ విభాగాలలో నిలకడైన ఆర్థిక పనితీరు, నిర్వహణ సామర్థ్యాలను తాజా ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. – ముకేశ్ డి.అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
ఐటీసీ లాభం రూ. 2,425 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) లో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ రూ. 2,425 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది (2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 2,230 కోట్లతో పోలిస్తే ఇది నామమాత్ర వృద్ధికాగా, ఎఫ్ఎంసీజీ, సిగరెట్ల బిజినెస్‌లో సాధించిన పురోగతి ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఆదాయం రూ.7,863 కోట్ల నుంచి రూ.9,024 కోట్లకు ఎగసింది. అయితే విమ్కోకు చెందిన ఇంజనీరింగ్యేతర బిజినెస్‌ను విడదీసి, కంపెనీలో విలీనం చేసినందున ఫలితాలను పోల్చిచూడలేమని ఐటీసీ పేర్కొంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ: క్యూ2లో సిగరెట్ల బిజినెస్ నుంచి రూ.4,251 కోట్ల ఆదాయం లభించింది. గతంలో ఇది రూ. 3,724 కోట్లు. ఎఫ్ఎంసీజీ విభాగం నుంచి రూ. 6,447 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఇది రూ. 5,686 కోట్లు మాత్రమే. పన్నుల పెంపు, చట్టవిరుద్ధ తయారీ, స్మగ్లింగ్ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సిగరెట్ల బిజినెస్‌లో వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. సిగరెట్ ప్యాక్‌పై 85% వరకూ చట్టబద్ధ హెచ్చరికలతోనే నింపమంటూ జారీ అయిన ప్రభుత్వ ఆదేశాల కారణంగా బిజినెస్‌కు విఘాతం కలిగే అవకాశముం దని తెలిపింది. వ్యవసాయ బిజినెస్ ఆదాయం రూ. 1,772 కోట్ల నుంచి రూ. 2,059 కోట్లకు పుంజుకుంది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 355 వద్ద ముగిసింది.


