సుజుకి మోటర్‌సైకిల్ ఇండియా తమ టూవీలర్లను సరళతరమైన రెంటల్, సబ్‌స్క్రిప్షన్ సర్వీసుల ద్వారా కస్టమర్లకు మరింతగా అందుబాటులోకి తెచ్చే దిశగా రాయల్ బ్రదర్స్ రెంటల్స్‌తో జట్టు కట్టింది.
ముందుగా సుజుకీ ఈ–యాక్సెస్ వాహనంతో మొదలుపెట్టి, రాబోయే రోజుల్లో ఇతర త్విచక్ర వాహనాలకు కూడా ఈ మోడల్‌ని విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు సంస్థ తెలిపింది. రాయల్ బ్రదర్స్ ప్లాట్‌ఫాం ద్వారా కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా 24 గంటల నుంచి 1 ఏడాది వరకు వ్యధికి రెంటల్ ఆప్షన్లను ఎంచుకోవచ్చని పేర్కొంది. రాయల్ బ్రదర్స్ రెంటల్స్‌కి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ఆగ్రా తదితర నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి.


