సుజుకి కీలక ప్రకటన.. 5000 బైకులపై ప్రభావం! | Suzuki Gixxer 250 Recalled Rear Brake Issue Over 5000 Units Affected | Sakshi
Sakshi News home page

సుజుకి కీలక ప్రకటన.. 5000 బైకులపై ప్రభావం!

Aug 31 2025 2:28 PM | Updated on Aug 31 2025 3:12 PM

Suzuki Gixxer 250 Recalled Rear Brake Issue Over 5000 Units Affected

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైకులకు రీకాల్ జారీ చేసింది. వెనుక బ్రేక్ సమస్యల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి నుంచి 2026 జూన్ మధ్యలో తయారైన 5145 యూనిట్ల బైకులపై ఈ రీకాల్ ప్రభావం పడింది. అయితే వినియోగాదారుల నుంచి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా బ్రాండ్ ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

వెనుక బ్రేక్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం.. ప్యాడ్‌లు, బ్రేక్ డిస్క్‌ల మధ్య సరైన కనెక్షన్ లేకపోవడమే. అత్యవసర సమయంలో బ్రేకింగ్ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి కంపెనీ దీనిని పరిష్కరించడానికి ఈ రీకాల్ జారీ చేసింది. ఫిబ్రవరి 2024లో కూడా ఇంజిన్ క్యామ్‌షాఫ్ట్ సమస్య కారణంగా సుజుకి జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250, వీ-స్ట్రామ్ ఎస్ఎక్స్ బైకులకు రీకాల్ జారీ చేసింది.

సుజుకి జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250 వినియోగదారులు బైకులోని సమస్యను పరిష్కరించుకోవడానికి సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ, సాంకేతిక నిపుణులు మోటార్‌సైకిల్‌ను తనిఖీ చేసి, కస్టమర్‌కు ఎటువంటి ఖర్చు లేకుండా అవసరమైన మరమ్మతులు చేస్తారు.

ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న వియాత్నం బ్రాండ్ కార్లు.. ఇవే

సుజుకి జిక్సర్ 250.. జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైకులు 249సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 26.5 హార్స్ పవర్, 22 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement