ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావం 10 లక్షల వాహనాలపై ప్రభావం చూపిస్తుంది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు పంపిన లేఖలో.. 1,024,407 వాహనాలను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది.
పనోరమిక్ వ్యూ మానిటర్ (PVM) సిస్టమ్‌లోని లోపం ఉన్నట్లు, ఈ లోపం కారణంగా.. రియర్‌వ్యూ కెమెరా సరిగ్గా పనిచేయకపోవడం జరుగుతుంది. దీనిని పరిష్కరించడానికి టయోటా రీకాల్ జారీ చేసింది. జపాన్‌లో ఫీల్డ్ రిపోర్టులు అందిన తర్వాత, ఏప్రిల్ 2024లో టయోటా ఈ సమస్యపై దర్యాప్తు ప్రారంభించింది. పరీక్ష సమయంలో, ఆటోమేకర్ సాఫ్ట్‌వేర్ సమస్యను కనుగొన్నారు.
రీకాల్ జాబితాలో.. టయోటా కార్లు మాత్రమే కాకుండా, లెక్సస్, సుబారు కార్లు కూడా ఉన్నాయి. నిజానికి టయోటా, లెక్సస్, సుబారు అనే మూడు కంపెనీలు టయోటా మోటార్ కార్పొరేషన్ కింద ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటి. దీనికింద ఐదు ప్రధానమైన బ్రాండ్స్ ఉన్నాయి.
రీకాల్ ప్రభావం వీటిపైనే..
➤2023-2025 టయోటా బీజెడ్4ఎక్స్
➤2025-2026 టయోటా క్యామ్రీ
➤2023-2026 టయోటా క్రౌన్
➤2025 టయోటా క్రౌన్ సిగ్నియా
➤2024-2026 టయోటా గ్రాండ్ హైలాండర్
➤2023-2025 టయోటా హైలాండర్
➤2024-2025 టయోటా ల్యాండ్ క్రూయిజర్
➤2023-2025 టయోటా మిరాయ్
➤2023-2025 టయోటా ప్రియస్
➤2023-2025 టయోటా RAV4
➤2025 టయోటా సియెన్నా
➤2023-2024 టయోటా వెన్జా
➤2023-2025 లెక్సస్ ఈఎస్
➤2024-2025 లెక్సస్ జీఎక్స్
➤2024-2025 లెక్సస్ ఎల్సీ
➤2023-2025 లెక్సస్ ఎల్ఎస్
➤2022-2025 లెక్సస్ ఎల్ఎక్స్
➤2022-2025 లెక్సస్ ఎన్
➤2023-2026 లెక్సస్ ఆర్ఎక్స్
➤2023-2025 లెక్సస్ ఆర్జెడ్
➤2024-2026 లెక్సస్ టీఎక్స్
➤2023-2025 సుబారు సోల్టెర్రా
పైన వెల్లడించిన సంవత్సరాల మధ్యలో తయారైన వాహనాలకు కంపెనీ రీకాల్ జారీ చేసింది. వాహన వినియోగదారులు సమీపంలోని టయోటా సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి సమస్యను ఉచితంగానే పరిష్కరించుకోవచ్చు.


