బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు (డిసెంబర్ 22) ఉదయం గరిష్టంగా రూ. 1100 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మరోమారు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,24,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,24,800 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 800 పెరిగిందన్న మాట. (ఉదయం 1000 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 800 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 1800 పెరిగింది).
24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1970 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,36,150 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 1100 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 870 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1970 పెరిగింది).
ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో సాయంత్రానికి 24 క్యారెట్ల ధర రూ. 1970 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,36,300 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1800 పెరిగి.. 1 24,950 రూపాయల వద్దకు చేరింది.
ఇక చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1850 పెరగడంతో రూ. 1,37,130 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1700 పెరిగి.. 1,25,700 రూపాయల వద్దకు చేరింది.


