కేటీఎం కంపెనీ తన 2024 లైనప్ బైకులకు ప్రపంచవ్యాప్తంగా రీకాల్ ప్రకటించింది. ఇందులో 125 డ్యూక్, 250 డ్యూక్, 390 డ్యూక్, 990 డ్యూక్ వంటివి ఉన్నాయి. ఫ్యూయెల్ ట్యాంక్ క్యాప్ సీల్స్ చిన్న పగుళ్లు ఏర్పడవచ్చు. దీనివల్ల పెట్రోల్ లీక్ అయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీ రీకాల్ జారీ చేసింది.
2024 మోడళ్లను కొనుగోలు చేసిన కేటీఎం బైక్ వినియోగదారులు.. ఈ సమస్యను ఉచితంగానే పరిష్కరించుకోవచ్చు. దీనికోసం వారు కంపెనీ అధీకృత సేవా కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. దీనికోసం బైకర్స్ ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
బజాజ్ ఆటో చేతికి కేటీఎమ్
దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా ఆ్రస్టియన్ బైక్ కంపెనీ కేటీఎమ్‌లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. 80 కోట్ల యూరోల(రూ. 7,765 కోట్లు) విలువైన ఒప్పందానికి యూరోపియన్ నియంత్రణ సంస్థల నుంచి అనుమతి పొందడం ద్వారా అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు బజాజ్ ఆటో తెలియజేసింది.


