జెండాల్ గ్రూప్‌లో భాగమైన గ్లోబల్ హ్యూమన్ వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ కంపెనీ.. బయోఫ్యాబ్రి వ్యాక్సిన్ ఆవిష్కరణ, తయారీలో ప్రపంచ అగ్రగామి అయిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BBIL) ఈరోజు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు ప్రకటించాయి.
రెండు సంస్థల భాగస్వామ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రాధాన్యతలకు అనుగుణంగా.. క్షయవ్యాధి వ్యాక్సిన్‌లకు అందించడానికి ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
2020లో లైసెన్సింగ్ అగ్రిమెంట్ తరువాత జరిగిన ఈ కొత్త టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఒప్పందం రెండు కంపెనీలను మరింత బలపరుస్తుంది. ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. ఆఫ్రికా, ఆగ్నేయాసియా అంతటా 70 కంటే ఎక్కువ దేశాలలో MTBVAC వ్యాక్సిన్ తక్కువ ఖర్చులో అందుబాటులో ఉండేలా చూడడం.


