పోర్స్చే (Porsche) కంపెనీ భారతదేశంలోని పనామెరా కార్లకు రీకాల్ ప్రకటించింది. సంస్థ ఈ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, రీకాల్ ప్రభావం ఎన్ని కారుపై ప్రభావం చూపుతుంది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పనామెరా కారును పోర్స్చే స్వచ్ఛందంగా రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావం 158 యూనిట్లపై ప్రభావం చూపుతుంది. SIAM వెబ్‌సైట్‌లో ప్రచురించిన నోటీస్ ప్రకారం.. కారులోని ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థకు సంబంధించిన లోపం కారణంగా రీకాల్ జారీ చేయడం జరిగిందని కంపెనీ స్పష్టం చేసింది.
పోర్స్చే పనామెరా యజమానులు.. బ్రాండ్ అధికారిక రీకాల్ పోర్టల్‌కు వెళ్లి వారి వాహన గుర్తింపు సంఖ్య (VIN)ను ఇన్‌పుట్ చేసి వారి కారు రీకాల్ జాబితాలో ఉందో.. లేదో అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. 2023 జులై 19 నుంచి 2025 సెప్టెంబర్ 02 మధ్య తయారైన వాహనాలు రీకాల్ జాబితాలో ఉన్నాయి. ఈ సమస్య ప్రమాదంలో వాహన వినియోగదారులపై ప్రభావం చూపిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ రీకాల్ జారీచేయడం జరిగింది.
ఇదీ చదవండి: కొత్త స్కూటర్ అమ్మకాల నిలిపివేత!
రీకాల్ యూనిట్లలో సమస్యను.. సంస్థ ఉచితంగానే పరిష్కరిస్తుంది. కాబట్టి దీనికోసం కస్టమర్లు లేదా వినియోగదారులు డబ్బు చెల్లించాల్సిన అవసరామ్ లేదు. కాగా పోర్స్చే గతంలో ఆస్ట్రేలియాలోని పనామెరా కార్లలో కూడా.. ఇలాంటి సమస్యను గుర్తించి వాటికి కూడా రీకాల్ జారీ చేసింది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
