భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో.. వాహన తయారీ సంస్థలు మార్కెట్లో ఎప్పటికప్పుడు ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా లెక్కకు మించిన ఈవీలు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ కథనంలో ఈ ఏడాది (2025) దేశీయ విఫణిలో కనిపించిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్
ఇండియన్ మార్కెట్లో ఎంతోమందికి ఇష్టమైన హ్యుందాయ్ క్రెటా.. ఈ ఏడాది ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయింది. ఇది 42 కిలోవాట్ బ్యాటరీ, 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఎంపికలతో లభిస్తుదఞ్హి. ఇవి రెండూ వరుసగా 420 కిమీ, 510 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ కారును డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 58 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 18.02 లక్షలు (ఎక్స్ షోరూమ్).
టాటా హారియార్ ఈవీ
2025 టాటా మోటార్స్ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి 'టాటా హారియార్ ఈవీ'. acti.ev ప్లస్ EV ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ కారు 65 kWh & 75 kWh బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 627 కిమీ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. ఇందులో లెవల్ 2 ఏడీఏఎస్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 21.49 లక్షలు (ఎక్స్ షోరూమ్).
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా ఎక్స్ఈవీ 9ఎస్ పేరుతో.. ఏడు సీట్ల ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది 59 kWh, 70 kWh, 79 kWh అనే బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఈ కారు రేంజ్.. ఎందుకుని బ్యాటరీ ప్యాక్, వేరియంట్‌ను బట్టి 521 కిమీ నుంచి 679 కిమీ వరకు ఉంటుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ట్రిపుల్ డిజిటల్ స్క్రీన్‌లు & లెవల్-2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. దీని ధర రూ. 19.95 లక్షలు (ఎక్స్ షోరూమ్).
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ
కియా మోటారు లాంచ్ చేసిన కారెన్స్ క్లావిస్ ఈవీ.. ఏడు సీట్ల లేఅవుట్‌ను పొందుతుంది. ఫ్యామిలీ కారు కావాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. ఇది 42 kWh & 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌లతో.. 404 కిమీ, 490 కిమీ రేంజ్ అందిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కారులో లెవల్-2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వంటివన్నీ ఉన్నాయి. దీని ధరలు రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.49 లక్షలు మధ్య ఉన్నాయి.
విన్‌ఫాస్ట్ వీఎఫ్7 & వీఎఫ్6
వియత్నామీస్ EV బ్రాండ్ విన్‌ఫాస్ట్ ఈ ఏడాది.. వీఎఫ్7 & వీఎఫ్6 కార్లను లాంచ్ చేసింది. వీఎఫ్7 ధరలు రూ. 20.89 లక్షల నుంచి రూ. 25.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులో 70.8 కిలోవాట్ బ్యాటరీ, 75.3 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో సింగిల్ మోటార్ & డ్యూయల్ మోటార్ వేరియంట్లలో లభిస్తుంది.
వీఎఫ్6 విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర రూ. 16.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణంగా 59.6 kWh బ్యాటరీతో.. ఫ్రంట్-మోటార్ సెటప్ & ఫాస్ట్-ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుంది. ఈ కారు 468 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ అద్భుతంగా ఉంటాయి.
వోల్వో ఈఎక్స్30
వోల్వో కంపెనీ ఈఎక్స్30 ప్రీమియం ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 69 kWh లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ కారు రియర్ మౌంటెడ్ మోటారుతో జతచేయబడి.. 272 bhp & 343 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 480 కిమీ రేంజ్ అందిస్తుంది. DC ఛార్జర్‌ని ఉపయోగించి 28 నిమిషాల్లో 10–80 శాతం ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 39.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).


