breaking news
Airbag
-
బైకర్ల కోసం ఎయిర్‌బ్యాగ్: ప్రమాదంలో రైడర్ సేఫ్!
ప్రమాదంలో ప్రాణాలను కాపాడంలో ఎయిర్ బ్యాగులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఎయిర్ బ్యాగ్స్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టే, కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు కొన్నిసార్లు ప్రాణాలతో బయటపడతారు. బైక్ రైడర్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే?, ఎంతబాగుంటుందో కదా.. దీనిని దృష్టిలో ఉంచుకునే నియోకవాచ్ (NeoKavach) కంపెనీ మొదటిసారి బైకర్స్ కోసం ఎయిర్‌బ్యాగ్ లాంచ్ చేసింది. దీనికి ధర ఎంత?, ఇదెలా ఉపయోగపడుతుంది? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.100 మిల్లీ సెకన్లలోపుబైక్ రైడర్ల భద్రత కోసం.. ఇండో-ఫ్రెంచ్ జాయింట్ వెంచర్ అయిన నియోకవాచ్, నియోకవాచ్ ఎయిర్ వెస్ట్‌ను ప్రవేశపెట్టింది. ఇది బైకర్స్ కోసం రూపొందించిన భారతదేశంలోని మొట్టమొదటి ఎయిర్‌బ్యాగ్ సిస్టం. ప్రమాదం జరిగినప్పుడు రైడర్ ఛాతీ, వెన్నెముక, మెడ వంటి భాగాలను ఇది రక్షిస్తుంది. ఈ ఎయిర్‌బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు కేవలం 100 మిల్లీ సెకన్లలోపు యాక్టివేట్ అవుతుంది. ముఖ్యమైన ప్రాంతాలకు కుషనింగ్ అందిస్తుంది.సాధారణంగా కారులో ప్రయాణించే వారితో పోలిస్తే.. మోటార్‌సైకిల్‌పై ప్రయాణించేవారికి ప్రమాదంలో తీవ్ర గాయలయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాటిని నివారించడానికే ఈ నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ వచ్చింది.భద్రతా ప్రమాణాలకు అనుగుణంగాఎలక్ట్రానిక్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌ల మాదిరిగా కాకుండా.. నియోకావాచ్ ఎయిర్ వెస్ట్ ఛార్జింగ్, బ్యాటరీలు లేదా సబ్స్క్రిప్షన్ల అవసరం లేని సరళమైన మెకానికల్ టెథర్ ట్రిగ్గర్ను ఉపయోగిస్తుంది. దీనిని రీసెట్ చేయవచ్చు. డిప్లాయ్‌మెంట్ తర్వాత తిరిగి ఉపయోగించవచ్చు. దీనిని రోజువారీ ప్రయాణంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది తేలికైనది కావడంతో రైడర్లకు అసౌకర్యంగా ఉండే అవకాశం లేదు. అంతే కాకుండా.. ఇది ప్రపంచ భద్రతా ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..మొత్తం మూడునియోకావాచ్ ఎయిర్ వెస్ట్ (రూ. 32,400) మాత్రమే కాకుండా.. కంపెనీ నియోకవాచ్ టెక్ బ్యాక్‌ప్యాక్ ప్రో (రూ. 40,800), నియోకవాచ్ టెక్‌ప్యాక్ ఎయిర్ (రూ. 36,000) లను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు ఉత్పత్తులు ఇప్పుడు నియోకావాచ్ అధికారిక వెబ్సైట్లో & భారతదేశం అంతటా ఎంపిక చేసిన అధీకృత రిటైలర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. -
ఎయిర్‌బ్యాగ్ ఇష్యూ.. ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం!
పోర్స్చే (Porsche) కంపెనీ భారతదేశంలోని పనామెరా కార్లకు రీకాల్ ప్రకటించింది. సంస్థ ఈ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, రీకాల్ ప్రభావం ఎన్ని కారుపై ప్రభావం చూపుతుంది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.పనామెరా కారును పోర్స్చే స్వచ్ఛందంగా రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావం 158 యూనిట్లపై ప్రభావం చూపుతుంది. SIAM వెబ్సైట్లో ప్రచురించిన నోటీస్ ప్రకారం.. కారులోని ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థకు సంబంధించిన లోపం కారణంగా రీకాల్ జారీ చేయడం జరిగిందని కంపెనీ స్పష్టం చేసింది.పోర్స్చే పనామెరా యజమానులు.. బ్రాండ్ అధికారిక రీకాల్ పోర్టల్‌కు వెళ్లి వారి వాహన గుర్తింపు సంఖ్య (VIN)ను ఇన్పుట్ చేసి వారి కారు రీకాల్ జాబితాలో ఉందో.. లేదో అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. 2023 జులై 19 నుంచి 2025 సెప్టెంబర్ 02 మధ్య తయారైన వాహనాలు రీకాల్ జాబితాలో ఉన్నాయి. ఈ సమస్య ప్రమాదంలో వాహన వినియోగదారులపై ప్రభావం చూపిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ రీకాల్ జారీచేయడం జరిగింది.ఇదీ చదవండి: కొత్త స్కూటర్ అమ్మకాల నిలిపివేత!రీకాల్ యూనిట్లలో సమస్యను.. సంస్థ ఉచితంగానే పరిష్కరిస్తుంది. కాబట్టి దీనికోసం కస్టమర్లు లేదా వినియోగదారులు డబ్బు చెల్లించాల్సిన అవసరామ్ లేదు. కాగా పోర్స్చే గతంలో ఆస్ట్రేలియాలోని పనామెరా కార్లలో కూడా.. ఇలాంటి సమస్యను గుర్తించి వాటికి కూడా రీకాల్ జారీ చేసింది. -
ఎయిర్ బ్యాగ్.. పిల్లాడి ప్రాణం తీసింది!
ప్రమాదాలు ఎప్పుడు, ఎలా సంభవిస్తాయో చెప్పలేం. అందుకే ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలంటారు పెద్దోళ్లు. ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లల విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరం. బైకులు, కార్లలో పిల్లలను ఎక్కించుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తుండడం ఇటీవల కాలంలో పెరిగింది. ఇదిలావుంచితే కారులో తండ్రి ఒడిలో కూర్చున్న బాలుడు ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని ఆలత్తూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కారులో హఠాత్తుగా ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ఆరేళ్ల పిల్లాడు చనిపోయాడు.వివరాల్లోకి వెళ్తే.. కల్పకం (Kalpakkam) సమీపంలోని పుదుపట్టిణం గ్రామానిక చెందిన వీరముత్తు, తన భార్య, కుమారుడు, మరో ఇద్దరితో కలిసి సోమవారం రాత్రి రెంటల్ కారులో చెన్నైకి బయలు దేరారు. విఘ్నేష్(26) అనే డ్రైవర్ కారు నడుపుతున్నాడు. వీరముత్తు తన ఆరేళ్ల కొడుకు కవిన్‌ను ఒళ్లో పెట్టుకుని ముందు సీట్లో కూర్చుకున్నాడు.తిరుపోరూర్ సమీపంలోని ఆలత్తూర్ (Alathur) పెట్రోల్ బంక్ వద్ద వీరికి కారుకు ప్రమాదం సంభవించింది. ముందెళున్న కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారులోని ఎయిర్‌బ్యాగ్ (airbag) కవిన్ ముఖంపై వేగంగా తెరుచుకోవడంతో అతడు కుప్పకూలిపోయాడు. బాలుడిని వెంటనే తిరుపోరూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పాడు. కుమారుడి ఆకస్మిక మరణంతో వీరముత్తు, అతడి భార్య హతాశులయ్యారు.ముందు వెళ్లిన కారు ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా సడన్‌గా కుడివైపు తిరగడంతో ప్రమాదం సంభవించిందని పోలీసులు గుర్తించారు. ఇందులో ఉన్న వ్యక్తిని తిరుపోరూర్ సమీపం పయ్యనూర్ గ్రామానికి చెందిన సురేష్ (48)గా గుర్తించారు. అతడు కారులో పయ్యనూర్ నుంచి తిరుపోరూర్ వెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపి బాలుడి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలతో సురేష్‌పై తిరుపోరూర్ (Thiruporur) పోలీసులు కేసు నమోదు చేశారు.నివేదిక వచ్చాకే..బాలుడి మృతదేహానికి చెంగల్పట్టు మెడికల్ కాలేజీలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. కవిన్ మరణానికి గల వాస్తవ కారణాలు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. అతడి ఒంటిపై కనిపించే గాయాలేవీ లేవన్నారు. షాక్, అంతర్గత రక్తస్రావం కారణంగా మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: కారుతో ఓవరాక్షన్.. వీడియో వైరల్ -
మోకాలికి ఏఐ కవచం.. ఎందుకో తెలుసా?
పరుగులు తీసేటప్పుడు, ఒక్కోసారి నడిచేటప్పుడు జారిపడే సందర్భాల్లో.. కేవలం 60 మిల్లీ సెకండ్లలోనే మోకాలి చిప్పకు, దాని లిగమెంట్లకు గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి లండన్‌కు చెందిన ‘హిప్పోస్’ అనే స్టార్టప్ కంపెనీ మోకాలికి ఏఐ కవచాన్ని తాజాగా రూపొందించింది.ఈ ఏఐ కవచాన్ని ధరించిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడుతున్నట్లయితే.. ఏఐ ఎయిర్‌బ్యాగ్ 30 మిల్లీ సెకండ్లలోనే తెరుచుకుని, గాయాలను నివారిస్తుంది. మోకాలికి ధరించే ఈ ఏఐ ఎయిర్ బ్యాగ్ పనితీరును ‘హిప్పోస్’ కంపెనీ నిర్వాహకులు లండన్‌లోని పలు ఫుట్‌బాల్ క్లబ్బులకు చెందిన క్రీడాకారులపై ప్రయోగించి, సంతృప్తికరమైన ఫలితాలను సాధించారు.ఇదీ చదవండి: పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియోఏఐ కవచాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ‘హిప్పోస్’ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అందువల్ల క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం 6.42 లక్షల డాలర్లు (రూ.5.43 కోట్లు) వరకు నిధులు సమకూరాయని ‘హిప్పోస్’ సంస్థ తెలిపింది. ఈ మోకాలి కవచాల ధర ఒక్కో జత 129 డాలర్లు (రూ.10,929) అవుతుందని, ప్రీఆర్డర్ల ద్వారా నిధులు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ‘హిప్పోస్’ వ్యవస్థాపకులు కైలిన్ షా, భావీ మెటాకర్ చెబుతున్నారు. -
ప్రపంచవ్యాప్తంగా 4,60,000 కార్లను రీకాల్ చేసిన వోల్వో
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ వోల్వో ప్రపంచవ్యాప్తంగా 4,60,000కు పైగా కార్లను రీకాల్ చేసింది. ఎయిర్ బ్యాగ్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కార్లను రీకాల్ చేసినట్లు వోల్వో తెలిపింది. స్వీడిష్ కార్ల తయారీ సంస్థ ప్రతినిధి యు.ఎస్. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడుతూ.. ఎయిర్ బ్యాగ్స్‌లో చిన్న సాంకేతిక సమస్య వల్ల వాహన చోదకుడీకి, ప్రయాణికులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రీకాల్ చేసినట్లు తెలిపారు. ఎన్ హెచ్ టిఎస్ఏకు సమర్పించిన సేఫ్టీ రీకాల్ నివేదికలో వోల్వో ఈ పరిస్థితికి సంబంధించి పూర్తిగా వివరించింది. అయితే, దీని ఫలితంగా మరణం సంభవించిందని తెలిపింది. ఈ లోపం టకాటా ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 మిలియన్ల భాగాలు రీకాల్ చేశారు. ఇలా వోల్వో మాత్రమే రీకాల్ చేయలేదు, అనేక ఇతర కంపెనీలు కూడా వాటి వాహనాలను చాలా సార్లు వాటి వాహనాలను రీకాల్ చేశాయి.(చదవండి: చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలికిన హాలీవుడ్..!) -
ఇక ఆ వాహనాలకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి
న్యూఢిల్లీ: అన్ని కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలలో ఫ్రంట్ ప్యాసింజర్ కు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న ఈ ఉత్తర్వులను కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. “వాహనం ముందు సీటులో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి చేస్తూ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఒక ముఖ్యమైన రక్షణ చర్యగా పేర్కొంది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సూచనల ఆధారంగా ఈ నిబంధనలు తీసుకురావడం జరిగినట్లు" కేంద్రం పేర్కొంది. 2021 ఏప్రిల్ 1న నుంచి కొనుగోలు చేసే ప్రతి కొత్త వాహనంలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఇక ఇప్పటికే కొన్న వాహనాలకు ఆ వాహనదారులు ఆగస్టు 31లోపు తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్స్ అమర్చుకోవాల్సి ఉంటుంది. గతంలో డిసెంబర్ 29, 2020న ఈ నిబంధనలు తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రతి వాహనంలోనూ ముందు సీట్ల కోసం డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. కొత్త వాహనాలకు ఏప్రిల్ 1, పాత వాహనాలకు జూన్ 1లోపు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. డ్రైవర్ సీట్ లో ఎయిర్ బ్యాగ్ తప్పనిసరిగా ఉండాలని 2019 నుంచే నిబంధన ఉండగా.. ప్రస్తుతం డ్రైవర్ పక్క సీటుకు కూడా దీన్ని కొనసాగించారు. ఈ నిబంధన అన్ని ఎం1 కేటగిరి వాహనాలకు వర్తిస్తుంది. ఎనిమిది సీట్ల కంటే తక్కువ సైజున్న ప్యాసెంజర్ వెహికిల్స్ అన్నీ ఈ కేటగిరిలోకి చేరతాయి. ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలోని రోడ్ ప్రమాద బాధితుల్లో 10 శాతం మంది భారతదేశం నుంచి ఉన్నారు. డ్రైవర్ పక్క సీటుకు కూడా ఎయిర్‌బ్యాగ్ ఉండటం వల్ల ప్రమాదం వల్ల కలిగే తీవ్రతను కొంచెం తగ్గించవచ్చు. దీనివల్ల డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు అదనపు రక్షణ లభిస్తుంది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నాలుగు చక్రాల వాహన ధరలు రూ.5,000 నుంచి 8,000 పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్ వ్యక్తి ప్రాణాలను కాపాడే ఆస్కారం ఎక్కువ కాబట్టి ఇది అంత పెద్ద ధర కాకపోవచ్చు. చదవండి: ఆరు నెలలు నీటి అడుగున ఐఫోన్ 11, అయినా కూడా.. రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్! -
6758 కార్లను రీకాల్ చేయనున్న ఆడీ కంపెనీ
న్యూఢిల్లీ: భారత్ లోని 6758 ఏ4 సెడాన్ కార్లను రీకాల్ చేయాలని లగ్జరీ కార్ల ఉత్పత్తి సంస్థ ఆడి నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2011 నుంచి అక్టోబర్ 2014 సంవత్సరాల మధ్య ఉత్పత్తి చేసిన కార్లను మాత్రమే రీకాల్ చేస్తున్నట్టు ఆడీ కంపెనీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేయడం కోసమే తప్ప.. ఎలాంటి పరికరాలను మార్చబోమని ఆడి తెలిపింది. ఆడీ ఏ4 కార్ల వినియోగదారులకు డీలర్లు అందుబాటులో ఉంటారని, సాఫ్ట్ వేర్ అప్ డేట్ కోసం అపాయింట్ మెంట్ తీసుకుంటారని ఆడి తెలిపింది.


