మోకాలికి ఏఐ కవచం.. ఎందుకో తెలుసా? | Hippos Ai Airbag For Knee | Sakshi
Sakshi News home page

మోకాలికి ఏఐ కవచం.. ఎందుకో తెలుసా?

Dec 22 2024 4:10 PM | Updated on Dec 22 2024 4:12 PM

Hippos Ai Airbag For Knee

పరుగులు తీసేటప్పుడు, ఒక్కోసారి నడిచేటప్పుడు జారిపడే సందర్భాల్లో.. కేవలం 60 మిల్లీ సెకండ్లలోనే మోకాలి చిప్పకు, దాని లిగమెంట్లకు గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి లండన్‌కు చెందిన ‘హిప్పోస్‌’ అనే స్టార్టప్‌ కంపెనీ మోకాలికి ఏఐ కవచాన్ని తాజాగా రూపొందించింది.

ఈ ఏఐ కవచాన్ని ధరించిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడుతున్నట్లయితే.. ఏఐ ఎయిర్‌బ్యాగ్‌ 30 మిల్లీ సెకండ్లలోనే తెరుచుకుని, గాయాలను నివారిస్తుంది. మోకాలికి ధరించే ఈ ఏఐ ఎయిర్‌ బ్యాగ్‌ పనితీరును ‘హిప్పోస్‌’ కంపెనీ నిర్వాహకులు లండన్‌లోని పలు ఫుట్‌బాల్‌ క్లబ్బులకు చెందిన క్రీడాకారులపై ప్రయోగించి, సంతృప్తికరమైన ఫలితాలను సాధించారు.

ఇదీ చదవండి: పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియో

ఏఐ కవచాన్ని మార్కెట్‌లోకి తీసుకురావడానికి ‘హిప్పోస్‌’ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అందువల్ల క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం 6.42 లక్షల డాలర్లు (రూ.5.43 కోట్లు) వరకు నిధులు సమకూరాయని ‘హిప్పోస్‌’ సంస్థ తెలిపింది. ఈ మోకాలి కవచాల ధర ఒక్కో జత 129 డాలర్లు (రూ.10,929) అవుతుందని, ప్రీఆర్డర్ల ద్వారా నిధులు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ‘హిప్పోస్‌’ వ్యవస్థాపకులు కైలిన్‌ షా, భావీ మెటాకర్‌ చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement