సుజుకి మోటార్‌సైకిల్ తన 2026 హయబుసాను ఆవిష్కరించింది. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో మెకానికల్ అప్డేట్స్ లేనప్పటికీ.. డిజైన్, కలర్ ఆప్షన్స్ వంటి వాటిలో అప్డేట్స్ చూడవచ్చు.
హయాబుసా 1,340 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 bhp పవర్, 150 Nm టార్క్ అందిస్తుంది. క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా అప్డేట్ అయింది. బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా ఇందులో ఉండటం గమనించవచ్చు.
అప్డేటెడ్ సుజుకి హయబుసా బ్లూ అండ్ వైట్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. 3డీ లోగో, ఫ్యూయెల్ ట్యాంక్‌పై ప్రత్యేక ఎడిషన్ బ్యాడ్జింగ్ వంటివి కూడా ఈ బైకులో కనిపిస్తాయి. దీని ధర సుమారు రూ. 21.55 లక్షలు. అయితే కంపెనీ ఈ బైకును భారతదేశంలో లాంచ్ చేస్తుందా? అనే విషయంపై స్పష్టత లేదు.
ఇదీ చదవండి: సేమ్ ప్రాబ్లమ్: మొన్న మారుతి సుజుకి.. నేడు టయోటా!


