సాధారణంగా సుజుకి హయబుసా ధర కొంత ఎక్కువగానే ఉంది. అలాంటి ఈ బైకును బంగారంతో తయారు చేస్తే.. దాని ధర ఇంకెంత ఉంటుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఒక మోటార్ ఈవెంట్‌లో బంగారు హయాబుసా కనిపించింది.
బంగారు హయాబుసాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ధర అక్షరాలా రూ.1.67 కోట్లు అని సమాచారం. ఈ బైకులో చాలా వరకు గోల్డ్ బాడీవర్క్ జరిగి ఉండటాన్ని గమనించవచ్చు. ఇందులో వజ్రాలను కూడా ఉపయోగించారు. కాగా బోల్టులు కూడా బంగారమే కావడం గమనార్హం.
ఇక్కడ కనిపించే బైకుకు వేసిన గోల్డ్ లీఫ్ పెయింట్ కోసం మాత్రమే రూ. 13.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెయింట్ వర్క్ మొత్తాన్ని.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటోమోటివ్ కళాకారులలో ఒకరైన మిస్టర్ డానీ పూర్తిచేశారు.
ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 63వేల కార్లపై ఎఫెక్ట్!
గోల్డ్ హయబుసా వెనుక టైరు.. పరిమాణంలో బుగట్టి కారు కంటే పెద్దదిగా ఉంది. కాగా ఇది 400 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ కలిగి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో ఆటోమొబైల్ ఔత్సాహికులను తెగ ఆకట్టుకుంటోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.


