Expensive Bikes
-
పాత బైక్ ధరకే 2025 సుజుకి హయబుసా
సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఖరీదైన బైకులలో సుజుకి హయబుసా ఒకటి. దీనిని కంపెనీ OBD2B నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేసింది. అయితే ఈ అప్డేట్ బైక్ ధరలో మాత్రమే ఎలాంటి మార్పు లేదు. అంటే ఈ కొత్త బైక్.. పాత బైక్ ధరకే అందుబాటులో ఉందన్నమాట.2025 సుజుకి హయబుసా బైక్ ధర రూ. 16.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). చూడటానికి మునుపటి బైక్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఉద్గార నియమాలకు అనుగుణంగా అప్డేట్ అయింది. ఈ బైక్ అదే 1340 సీసీ ఇంజిన్ ద్వారా 190 హార్స్ పవర్, 150 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.ఇదీ చదవండి: దేశీయ మార్కెట్లో ఆస్ట్రియన్ బ్రాండ్ బైక్ లాంచ్: రేటెంతంటే?కొత్త హయబుసా ఇప్పుడు మెటాలిక్ మ్యాట్ స్టీల్ గ్రీన్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్/మెటాలిక్ మ్యాట్ టైటానియం సిల్వర్, మెటాలిక్ మిస్టిక్ సిల్వర్/పెర్ల్ వైగర్ బ్లూ అనే కొత్త డ్యూయెల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
భారత్‌లో ఖరీదైన స్కూటర్ లాంచ్: రేటు ఎంతంటే?
బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) ఇండియన్ మార్కెట్లో.. 'సీ 400 జీటీ' స్కూటర్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్, దాని మునుపటి మోడల్ కంటే అప్డేట్స్ పొందుతుంది. కాబట్టి దీని ధర స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 25000 ఎక్కువ. దీంతో ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న స్కూటర్లలో ఇది ఒకటిగా చేరింది.బీఎండబ్ల్యూ సీ 400 జీటీ స్కూటర్.. సాధారణ ప్రయాణానికి మాత్రమే కాకుండా, దూర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని 350 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7500 rpm వద్ద 34 Bhp పవర్, 5750 rpm వద్ద 35 Nm టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ లీన్-సెన్సిటివ్ బ్రేకింగ్ అసిస్ట్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్‌తో కూడిన ఏబీఎస్ వంటి రైడర్ అసిస్ట్ ఫీచర్లను పొందుతుంది.సీ 400 జీటీ స్కూటర్.. పెద్ద విండ్‌షీల్డ్ పొందుతుంది. ఇది బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, డైమండ్ వైట్ మెటాలిక్ పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంది. ఇది హై రిజల్యూషన్ ఇంటర్ఫేస్తో నావిగేషన్, మీడియా అండ్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి వాటిని మెరుగుపరుస్తుంది. అండర్ సీట్ కంపార్ట్మెంట్ 37.6 లీటర్లు. కాబట్టి ఇది అన్ని విధాలా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు
'బీఎండబ్ల్యూ మోటొరాడ్' దేశీయ మార్కెట్లో సరికొత్త 'ఎమ్ 1000 ఎక్స్ఆర్' బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 45 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే భారతీయ విఫణిలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఇది కూడా ఒకటిగా చేరింది. ఇది సీబియూ మార్గం ద్వారా ఇండియాకు దిగుమతి అవుతాయి. ఈ బైక్ బుక్ చేసుకుంటే డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి.మంచి డిజైన్ కలిగిన ఈ బైక్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 6.5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది. అంతే కాకుండా ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, బ్రేక్ స్లైడ్ అసిస్ట్ ఫంక్షన్, లాంచ్ కంట్రోల్ మరియు పిట్ లేన్ లిమిటర్ ఫంక్షన్లు వంటి అనేక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్ బైక్ 999సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 199 Bhp పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం వాడుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 278 కిమీ కావడం గమనార్హం. ఇందులో రెయిన్, రోడ్, డైనమిక్, డైనమిక్ ప్రో మరియు రేస్ ప్రో మోడ్ అనే ఐదు రైడింగ్ మోడ్లు ఉన్నాయి.