
లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ అయిన డుకాటి.. '2025 మల్టీస్ట్రాడా వీ4'ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ అడ్వెంచర్ టూరర్ ప్రారంభ ధర రూ. 22.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనిని కొత్త అప్‌డేట్‌లతో పాటు.. మెరుగైన ఇంధన సామర్థ్యం అందించేలా కూడా నిర్మించారు.
2025 డుకాటి మల్టీస్ట్రాడా వీ4.. డబుల్ ఫ్రంట్ హెడ్‌లైట్ పొందుతుంది. రైడర్ కాళ్లకు ఎక్కువ స్పేస్ అందించడానికి.. పన్నీర్లు, టాప్ కేస్ వంటివి ఉన్నాయి.
ఇదీ చదవండి: హైబ్రిడ్ vs ఎలక్ట్రిక్ కార్లు: ప్రయోజనాలు
మల్టీస్ట్రాడా వీ4 బైక్.. 6.5 ఇంచెస్ ఫుల్ TFT కలర్ స్క్రీన్, 4 పవర్ మోడ్‌లు, 5 రైడింగ్ మోడ్‌లు (స్పోర్ట్, టూరింగ్, అర్బన్, వెట్, ఎండ్యూరో), డుకాటి వెహికల్ అబ్జర్వర్ (DVO), డుకాటి వీలీ కంట్రోల్ (DWC), డుకాటి ట్రాక్షన్ కంట్రోల్ (DTC), ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ (EBC), క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది 1,158cc గ్రాంటురిస్మో ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 170 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది.