
భారతదేశంలో ఫ్యూయెల్ కార్లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా కొందరు వీటిని ఎంచుకుంటారు. ఈ కథనంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు గురించి తెలుసుకుందాం.
హైబ్రిడ్ కార్లు
హైబ్రిడ్ కార్లు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE)ను విద్యుత్ మోటారుతో కలుపుతాయి. ఎంచుకునే హైబ్రిడ్ రకాన్ని బట్టి.. ఆ కారు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటరుతో నడుస్తుంది. ఇవి మైల్డ్ హైబ్రిడ్ (చిన్న ఎలక్ట్రిక్ మోటార్, ఇంజిన్‌కు సపోర్ట్), ఫుల్ హైబ్రిడ్ (ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలిసి పనిచేస్తాయి), ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (పెద్ద బ్యాటరీ, ప్లగ్ ద్వారా చార్జ్ చేయవచ్చు) అని మూడు రకాలుగా ఉంటాయి.
ప్రయోజనాలు
●ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగపడతాయి.
●పూర్తిగా ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడే ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగా కాకుండా.. హైబ్రిడ్ కార్లకు ఇంధన స్టేషన్లలో ఫ్యూయల్ నింపుకోవచ్చు.
●సాంప్రదాయ కార్ల కంటే తక్కువ ఉద్గారాలు వెలువడతాయి.
●సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.
ఇదీ చదవండి: 2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లు
ఎలక్ట్రిక్ కార్లు
ఇవి పూర్తిగా బ్యాటరీలతోనే నడుస్తాయి. వీటిని మళ్ళీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. వీటికోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
ప్రయోజనాలు
●తక్కువ నిర్వహణ ఖర్చు
●పన్ను ప్రయోజనాలు, సబ్సిడీల వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తాయి
●సైలెంట్ డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు. ఇందులో ఇంజిన్ లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది.
●ఉద్గారాలు సున్నా శాతం, కాలుష్య కారకాలు విడుదల కావు.