breaking news
comparision
-
హైబ్రిడ్ vs ఎలక్ట్రిక్ కార్లు: ప్రయోజనాలు
భారతదేశంలో ఫ్యూయెల్ కార్లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా కొందరు వీటిని ఎంచుకుంటారు. ఈ కథనంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు గురించి తెలుసుకుందాం.హైబ్రిడ్ కార్లుహైబ్రిడ్ కార్లు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE)ను విద్యుత్ మోటారుతో కలుపుతాయి. ఎంచుకునే హైబ్రిడ్ రకాన్ని బట్టి.. ఆ కారు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటరుతో నడుస్తుంది. ఇవి మైల్డ్ హైబ్రిడ్ (చిన్న ఎలక్ట్రిక్ మోటార్, ఇంజిన్‌కు సపోర్ట్), ఫుల్ హైబ్రిడ్ (ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలిసి పనిచేస్తాయి), ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (పెద్ద బ్యాటరీ, ప్లగ్ ద్వారా చార్జ్ చేయవచ్చు) అని మూడు రకాలుగా ఉంటాయి.ప్రయోజనాలు●ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగపడతాయి.●పూర్తిగా ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడే ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగా కాకుండా.. హైబ్రిడ్ కార్లకు ఇంధన స్టేషన్లలో ఫ్యూయల్ నింపుకోవచ్చు.●సాంప్రదాయ కార్ల కంటే తక్కువ ఉద్గారాలు వెలువడతాయి.●సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.ఇదీ చదవండి: 2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లుఎలక్ట్రిక్ కార్లుఇవి పూర్తిగా బ్యాటరీలతోనే నడుస్తాయి. వీటిని మళ్ళీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. వీటికోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.ప్రయోజనాలు●తక్కువ నిర్వహణ ఖర్చు●పన్ను ప్రయోజనాలు, సబ్సిడీల వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తాయి●సైలెంట్ డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు. ఇందులో ఇంజిన్ లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది.●ఉద్గారాలు సున్నా శాతం, కాలుష్య కారకాలు విడుదల కావు. -
సోషల్ మీడియా.. ఆ ఆనందం కృత్రిమమే!
నాకు పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది. మాది మధ్య తరగతి కుటుంబం. నాది ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, నా భార్య ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇతరులతో పోల్చుకునే తత్వం ఎక్కువ. స్నేహితులు, చుట్టాలు సోషల్ మీడియాలో పెట్టే రకరకాల పోస్టులు చూసి వాళ్ళలాగా ఖరీదైన బట్టలు, నగలు కొనుక్కోవాలి, రెస్టారెంట్లుకి తరచు వెళ్ళాలి, విలాసవంతమైన లైఫ్ గడపాలి అని నన్ను ఇబ్బంది పెడుతుంటుంది. అందుకోసం అప్పులు చేస్తుంది. నాతో కూడా అప్పులు చేయించింది. హోటల్‌కు కానీ, టూర్‌కి కానీ వెళ్లినా, అక్కడి ఫుడ్‌ని, ప్లేస్‌ని ఎంజాయ్ చేయకుండా తన ఆలోచన అంతా ఫోటోలు తీయడం, వెంటనే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మీదే ఉంటుంది. ఆ తర్వాత వాటికి ఎన్ని లైక్‌లు, కామెంట్స్ వచ్చాయని చూసుకోవడం... రోజంతా ఇదే సరిపోతుంది. ఆమె పైన ఉన్న ప్రేమతో ఇప్పటిదాకా నేను సహించాను కానీ ఇక నావల్ల కావట్లేదు. ఆమె పద్ధతి మార్చే మార్గముంటే చె΄్తారని ఆశిస్తున్నాను.– శ్రీకుమార్, విశాఖపట్టణం సోషల్ మీడియాలో చూసి ఇతరులతో పోల్చుకుంటూ వాళ్లలా ఉండటం కోసం అప్పులు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నమవుతాయో చెప్పడానికి మీ జీవితమే ఒక ఉదాహరణ. ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాల్లోని వారు కనెక్టవడం కోసం, స్నేహితులు, బంధువులతో మన సంతోషాలు, బాధలు పంచుకోవడం కోసం, సోషల్‌మీడియా ఒక ΄్లాట్ఫాం లాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది వాస్తవ జీవితానికి దూరంగా, డిజిటల్ లైఫ్‌లోనే బతుకుతూ, సోషల్ మీడియా మాయలో పడి వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా నల్గురితో ఫ్రీగా కలవలేనివారు, ఆత్మన్యూనతతో బాధపడేవారు, జీవితంలోని ప్రత్యేక సంఘటనలను ఫిల్టర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వాటికి వచ్చే కామెంట్స్, లైక్స్ చూసుకుని ఒక ‘ఫేక్ సక్సెస్’(కృత్రిమ విజయం)ని ఆనందిస్తున్నారు. ఎవరి జీవితాల్లోనూ అన్నీ సంతోషాలే ఉండవు. తమ బాధలను, కష్టాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు, కేవలం సక్సెస్ సోరీస్’ మాత్రమే పోస్ట్ చేస్తుంటారు. అది చూసి ఇతరులు కూడా తమ బాధలను పక్కన పెట్టి సక్సెస్‌ను మాత్రమే పోస్ట్ చేయాలన్న తాపత్రయంతో ఇలాంటివి పోస్ట్ చేసి కృత్రిమ ఆనందాన్ని పొందుతుంటారు. సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజమని నమ్మి మీ భార్యలాంటి చాలామంది లేనిపోని ఆర్భాటాలకు పోయి ఇలా అప్పుల పాలవుతున్నారు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళటం, సరదాగా ప్రయాణాలు చేయాలనుకోవటం తప్పేం కాదు, కానీ మన స్థోమతని బట్టి అందుబాటులో ఉన్న ప్రదేశాలకి వెళ్ళడం.. అలా వెళ్ళే ప్రదేశమేదైనా కానీ అక్కడ అందరూ సరదాగా గడిపిన క్షణాలు, కబుర్లే మనకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాలని గుర్తుంచుకోవాలి. నిజమైన సంతోషం అంటే లాంగ్‌టూర్లు, కాస్ట్లీ రెస్టారెంట్లూ కాదు, మనవారితో గడిపే సంతోష క్షణాలే! మీరిద్దరూ కలిసి, ఒకసారి మానసిక వైద్యనిపుణుని కలిస్తే ఆమెకేవైనా వ్యక్తిత్వ సమస్యలు, ఇతర మానసిక ఇబ్బందులు ఉంటే, పరీక్షించి, వాటికి తగిన కౌన్సెలింగ్, చికిత్స ఇస్తారు. మీరు కూడ ఇక ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆశిద్దాం! ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
టీవీఎస్ ఆర్బిటర్ vs ఐక్యూబ్: ఏది ఎక్కువ రేంజ్..
టీవీఎస్ మోటార్ ఇటీవలే.. ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది దేశీయ విఫణిలో.. ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న ఐక్యూబ్ ఈవీకి అమ్మకాల పరంగా కొంత పోటీ పడుతుంది. రెండూ ఒకే కంపెనీకి చెందినవైనప్పటికీ.. డిజైన్, ఫీచర్స్, ధరల్లో వ్యత్యాసం ఉంది. ఈ వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ఆర్బిటర్ vs ఐక్యూబ్: డిజైన్ & ఫీచర్స్కొత్త టీవీఎస్ ఆర్బిటర్ 845 మిమీ ప్లాట్ సీటు, ఫ్లాట్ ఫ్లోర్ పొందుతుంది. దీని కారణంగా రైడర్ రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ అనుభవించవచ్చు. ఇది 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉంది. అండర్ సీట్ స్టోరేజ్ అనేది ఐక్యూబ్‌లో 32 లీటర్లు.కొత్త ఆర్బిటర్ ముందు భాగంలో హై-మౌంటెడ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఉంది. ఇది డీఆర్ఎల్ స్ట్రిప్‌తో కలిసి.. ఫ్రంట్ ఆప్రాన్లో విలీనం అవుతుంది. ఈ స్కూటర్ రెండు చివర్లలో 14 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 169 మిమీ. ఇది క్రూయిజ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్, ఆటోమేటెడ్ హిల్ అసిస్ట్, బ్లూటూత్ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ పొందుతుంది.టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వస్తే.. ఇది ప్రీమియం డిజైన్ పొందుతుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ TFT డిస్ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డాక్యుమెంట్ స్టోరేజ్, కాల్/ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటివి ఉన్నాయి. 12 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ స్కూటర్.. ఆర్బిటర్ కంటే కూడా కొంత తక్కువ అండర్ సీట్ కెపాసిటీ పొందుతుంది.ఆర్బిటర్ vs ఐక్యూబ్: పర్ఫామెన్స్ & రేంజ్టీవీఎస్ ఆర్బిటర్ 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 158 కిమీ రేంజ్ అందిస్తుంది. ఐక్యూబ్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 145 కిమీ రేంజ్ అందిస్తుంది. ఐక్యూబ్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్ మాత్రమే కాకుండా.. 2.2 కిలోవాట్, 3.1 కిలోవాట్, 5.3 కిలోవాట్ అనే మూడు బ్యాటరీ ఎంపికలలో లభిస్తుంది. ఆర్బిటర్ ప్రారంభ ధర రూ. 99000కాగా.. ఐక్యూబ్ ప్రారంభ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
పోలికతో ప్రమాదమే !
విజయవాడకు చెందిన కార్తిక్ ఓ విశ్వ విద్యాలయంలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రతి సెమిస్టర్లో 9 జీపీఏకు పైగా మార్కులు సాధిస్తున్నాడు. కానీ తనకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారితో పోల్చుకుంటూ ప్రతిసారీ తీవ్ర నిరాశకు లోనై ఆత్మనూన్యతాభావంతో ఉంటున్నాడు. దీంతో తల్లిదండ్రులు గమనించి ఓ సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు. నగరానికే చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థిని ఇన్‌స్టాలో తరచూ పోస్టులు పెడుతుంటుంది. తాను పెట్టిన రీల్స్ కంటే, స్నేహితుల రీల్స్‌కు ఎక్కువ లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. తనకు తక్కువగా వస్తున్నాయని నిరాశ చెందుతోంది. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో ఎదుటి వారితో తమను పోల్చుకుంటూ తీవ్ర నిరాశకు గురవుతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. చదువు మార్కులు వారితో సమానంగా రావడం లేదని, సోషల్ మీడియాలో సైతం లైక్‌లు తనకు తక్కువగా వస్తున్నాయని ఇలా అనేక విషయాల్లో ఎదుటి వారితో పోల్చుకుంటూ ఆత్మనూన్యతా భావానికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. వారిలా నేనెందుకు సక్సెస్ కాలేక పోతున్నామని కుంగుబాటుకు గురవుతున్నట్లు మానసిక నిపుణులు అంటున్నారు. ఇతరులతో పోల్చుకోవడం ప్రేరణను ఇవ్వకపోగా మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తుందంటున్నారు. ఈ సమస్యతో పిల్లలు, విద్యార్థులే కాదు, లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయి. ఈ పది మార్గాలు పాటించండి.. ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. ‘నిన్న కంటే నేడు ఏం మెరుగయ్యాను’ అని ప్రశ్నించుకుని మీ ప్రోగ్రెస్‌ను గమనించండి. సోషల్ మీడియా ఒక ఫిల్టర్ చేసిన ప్రపంచం. ఇన్‌స్టాగామ్‌లో ఎవరి విజయమూ ఫుల్ స్టోరీ కాదు. మీ ప్రయాణం నిజమైనదిగా, నిజాయతీగా ఉంటే చాలు. ప్రయత్నం మీద ఫోకస్ చేయండి. ఎంతసేపు కష్టపడ్డారు, ఎలా ఫోకస్ చేశారన్నదే అసలైన విజయానికి సూచిక. మీ బలాల జాబితా తయారు చేసుకోండి. ‘నాలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి...?’ అని రాసుకోండి. మైండ్ ఫుల్ బ్రేకులు తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోండి. పోలిక వల్ల వచ్చే నెగిటివ్ భావాల నుంచి బయటపడేందుకు ప్రతిరోజూ పది నిమిషాల సేపు మైండ్ ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. పరీక్షలు ఓ పోటీ కాదు, నేర్చుకునే ప్రయాణం అని గుర్తుంచుకోండి. ఫలితాల కోసమే కాకుండా, అభివృద్ధి కోసం చదవండి. ఇతరులు చేసిన విమర్శలు మీ విలువకు ప్రమాణం కాదు. ఏదైనా కామెంట్, మెసేజ్ వల్ల తక్కువగా ఫీలవకండి. అది వాళ్ల అభిప్రాయం మాత్రమే అని గుర్తించండి. మీ సొంత లక్ష్యాలపై స్పష్టత కలిగి ఉండండి. ఇతరులు ఎటు పోతున్నారన్న దానికన్నా, మీరు ఎందుకు చదువుతున్నారన్న దానిపై దృష్టి పెట్టండి. తప్పుల నుంచి నేర్చుకోండి. తప్పు చేయడమంటే ఫెయిలవ్వడం కాదు, నేర్చుకునే అవకాశం అనే దృష్టితో చూడండి. మీరు వేరెవరిలానో మారాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు అంగీకరించుకోండి. మీ బాటలో మీరున్నారని నమ్మండి. అసలేంటీకంపేరిజన్ సిండ్రోమ్.. ? మనిషి తనను తాను అర్థం చేసుకునేందుకు ఇతరులతో పోల్చుకుంటాడు. అది సహజం. కానీ టెక్నాలజీ, సోషల్ మీడియా, టాప్ ర్యాంక్స్, పక్కింటి పిల్లలతో పోలికలు– ఇవన్నీ ఇప్పుడు పిల్లల మనసుల్లో భయాన్ని, ఆందోళనను, న్యూనత భావాన్ని నింపుతున్నాయి. ఇలా ఇతరులతో పోల్చుకుని తనను తాను తక్కువ చేసుకోవడమే కంపేరిజన్ సిండ్రోమ్. సోషల్ కంపేరిజన్ సిద్ధాంతాన్ని 1954లో లియోన్ ఫెస్టింజెర్ అనే సైకాలజిస్ట్ ప్రతిపాదించాడు. మన అసలైన విలువను పక్కన పెట్టి, ఇతరుల ప్రమాణాలతో మన జీవితం నడపడమే దీని లక్షణం. ఈ పోలికలు వాళ్లకంటే తక్కువగా ఉన్నవారితో లేదా మెరుగ్గా ఉన్నవారితో జరగొచ్చు. పోలికలు నెగిటివ్ దిశలో ఎక్కువగా జరిగితే ఆత్మన్యూనత, అసంతృప్తి, ఆత్మనింద పెరుగుతాయి. = కంపేరిజన్ అనేది ఒక ట్రాప్. ఏ రెండు వేలిముద్రలూ ఒకలా ఉండనట్లే, ఏ ఇద్దరు విద్యార్థులూ ఒకేలా ఉండరు, ఒకేలా చదవరు, చదవలేరు. ఈ కంపేరిజన్ ట్రాప్ నుంచి బయటపడితేనే అసలైన ప్రతిభ కనిపిస్తుంది. అర్ధవంతమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలి.. పోలిక హానికరమైన ప్రభావాలను గుర్తించడం, మన ప్రత్యేకతను స్వీకరించడం, కృతజ్ఞతను పెంపొందించుకోవడం చేయాలి. అర్థవంతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం, మద్దతు ఇచ్చే సమాజాన్ని నిర్మించడం ద్వారా, మనం పోలిక ఉచ్చు నుంచి బయటపడి మన సొంత వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టవచ్చు. – డాక్టర్ గర్రే శంకరరావు,సైకాలజిస్ట్ -
పెట్రోల్ బైక్ vs ఎలక్ట్రిక్ బైక్: ఏది ఎంచుకోవాలి?
ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే కాకుండా సీఎన్జీ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది.. ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? పెట్రోల్ బైక్ కొనాలా? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ కథనంలో దేనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.ఎలక్ట్రిక్ బైక్స్ప్రస్తుతం మార్కెట్లో దాదాపు ప్రతి కంపెనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. పెట్రోల్ మోడల్స్‌తో పోలిస్తే.. ఎలక్ట్రిక్ బైకులకు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ. అంతే కాకుండా ఇవి పర్యావరణ హితం కూడా. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎలాంటి కాలుష్య కారకాలను వాతావరణంలోకి విడుదల చేయవు.ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీ లేదా లిథియం అయాన్ పాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి ఎక్కువ మన్నికను ఇస్తాను. సంస్థలు కూడా ఈ బ్యాటరీలపైన మంచి వారంటీ కూడా అందిస్తాయి. విద్యుత్ శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా.. శిలాజ ఇంధన వినియోగం మాత్రమే కాకుండా కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతాయి.ఇదీ చదవండి: తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులుపెట్రోల్ బైక్స్చాలా కాలంగా ఎక్కువమంది పెట్రోల్ బైకులనే ఉపయోగిస్తున్నారు. ఇంధనం అయిపోగానే.. వెంటనే ఫిల్ చేసుకోవడానికి లేదా నింపుకోవడానికి పెట్రోల్ బంకులు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఈ పెట్రోల్ బైకులకు ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది పెట్రోల్ బైకులను కొనుగోలు చేస్తుంటారు. పనితీరు పరంగా కూడా పెట్రోల్ బైకులు.. ఎలక్ట్రిక్ బైకుల కంటే ఉత్తమంగా ఉంటాయి.ఎలక్ట్రిక్ బైక్స్ ఎక్కువ కొనుగోలు చేయకపోవడానికి కారణంఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైక్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలామంది పెట్రోల్ బైక్స్ కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. దీనికి ప్రధాన కారణం మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ కావలసినన్ని అందుబాటులో లేకపోవడం అనే తెలుస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే.. ఛార్జింగ్ మధ్యలోనే ఖాళీ అవుతుందేమో అనే భయం కూడా ఎక్కువమంది కొనుగోలు చేయకపోవడానికి కారణం అనే చెప్పాలి. -
ఎన్ఎక్స్200 vs ఎక్స్‌పల్స్ 200 4వీ: ఏది బెస్ట్ బైక్?
భారతదేశంలో ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ అయిన.. హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle) తన సీబీ200ఎక్స్ స్థానంలో 'ఎన్ఎక్స్200'ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని అడ్వెంచర్ టూరర్ అని పిలిచింది. ఈ బైక్ టూరింగ్ కోసం ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నప్పటికీ.. ఇది హీరో ఎక్స్‌పల్స్ 200 4Vకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండు బైకుల మధ్య వ్యత్యాసం ఏంటో ఇక్కడ చూద్దాం.ధర: హోండా ఎన్ఎక్స్200 ఒక వేరియంట్లో మాత్రమే రూ. 1.68 లక్షలకు అందుబాటులో ఉంది. కాగా హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ స్టాండర్డ్, ప్రో, ప్రో డాకర్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ. 1.51 లక్షల నుంచి రూ. 1.67 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.ఫీచర్స్: హోండా ఎన్ఎక్స్200.. హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ రెండూ కూడా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్‌లైట్, టర్న్ ఇండికేటర్లు, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటిని పొందుతాయి. ఎక్స్‌పల్స్ 200 4వీ టర్న్-బై-టర్న్ నావిగేషన్ పొందుతుంది, ఎన్ఎక్స్200 ట్రాక్షన్ కంట్రోల్ పొందుతుంది.ఇదీ చదవండి: బీవైడీ సీలియన్ 7 వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ, హోండా ఎన్ఎక్స్200 కంటే ఎత్తుగా, పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది. హోండా ముందు భాగంలో అప్సైడ్డౌన్ ఫోర్కే పొందుతుంది. కానీ హీరో దాని సస్పెన్షన్ సెటప్ కోసం ఫుల్లీ అడ్జస్టబుల్ పొందుతుంది.పవర్‌ట్రెయిన్: హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ.. 199.6 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ - కూల్డ్ ఇంజిన్ కలిగి 8,500 rpm వద్ద 18.9 Bhp & 6,500 rpm వద్ద 17.35 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇక హోండా ఎన్ఎక్స్200 బైక్ 184.4 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 17.03 bhp పవర్, 15.9 Nm టార్క్ అందిస్తుంది. ఇందులో కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. రెండూ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయి. -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్: బజాజ్ ప్లాటినా 100 vs హోండా షైన్
రోజువారీ వినియోగానికి లేదా ఎక్కువ మైలేజ్ కావాలని కోరుకునేవారు బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్ వంటి బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇవి రెండూ.. సింపుల్ డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటం మాత్రమే కాకుండా మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తాయి. ఈ కథనంలో ఈ రెండు బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.బజాజ్ ఆటో లాంచ్ చేసే బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇందులో ప్లాటినా 100 కూడా ఉంది. ఇందులో 102 సీసీ ఫోర్ స్ట్రోక్ డీటీఎస్-ఐ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.9 పీఎస్ పవర్, 8.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 90 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.హోండా షైన్ విషయానికి వస్తే.. ఇది 123.94 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 10.74 పీఎస్ పవర్, 11 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 75 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ బైక్.. సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.ఇదీ చదవండి: హోండా యాక్టివా ఈ vs సుజుకి ఈ యాక్సెస్: ఏది బెస్ట్?డిజైన్, ఫీచర్స్ పరంగా బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్.. రెండూ చాలా అనుకూలంగా ఉంటాయి. ఇతర బైకులతో పోలిస్తే.. ఈ రెండు బైకులు మంచి మైలేజ్ అందించడం వల్ల, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. బజాజ్ ప్లాటినా 100 ప్రారంభ ధరలు రూ. 68,685 కాగా.. హోండా షైన్ ధర రూ. 84151 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). -
హోండా యాక్టివా ఈ vs సుజుకి ఈ యాక్సెస్: ఏది బెస్ట్?
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 వేదికగా హోండా మోటార్‌సైకిల్ కంపెనీ తన 'యాక్టివా ఈ' స్కూటర్ లాంచ్ చేసింది. సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ ఈ-యాక్సెస్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించింది. ఇది త్వరలోనే దేశీయ మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే ఈ రెండు స్కూటర్ల మధ్య తేడా ఏంటి?.. రేంజ్ ఎంత, బ్యాటరీ కెపాసిటీ ఏమిటనే వివరాలను వివరంగా తెలుసుకుందాం.ఫీచర్స్హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, రివర్స్ మోడ్, ఆటో బ్రైట్నెస్ అడ్జస్టేబుల్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, స్మార్ట్ కీ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. యాక్టివా ఈ స్కూటర్ టచ్‌స్క్రీన్ కూడా పొందుతుంది. దీని ద్వారా రైడర్ బ్యాటరీ స్టేటస్, టైమ్ మొదలైనవన్నీ తెలుసుకోవచ్చు.సుజుకి ఈ యాక్సెస్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT క్లస్టర్ పొందుతుంది. దీని ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మెసేజ్ నోటిఫికేషన్స్ పొందవచ్చు. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ అలర్ట్ సిస్టమ్‌తో కూడిన స్మార్ట్ కీ కూడా లభిస్తుంది.బ్యాటరీ, రేంజ్ & పర్ఫామెన్స్హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5 కిలోవాట్ కెపాసిటీ కలిగిన రెండు రిమూవబుల్ బ్యాటరీలు పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌పై 102 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ-యాక్సెస్ స్కూటర్ 3.07 కిలోవాట్ లిథియం ఐరన్ బ్యాటరీ ద్వారా.. 95 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.పర్ఫమెన్స్ విషయానికి వస్తే.. యాక్టివా ఈ స్కూటర్ 6 kW పవర్, 22 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. కాగా .. ఇది ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఈ-యాక్సెస్ స్కూటర్ 4.1 kW పవర్, 15 Nm టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 71 కిమీ. ఇది కూడా మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. -
థార్ రాక్స్ Vs గూర్ఖా: ఆఫ్ రోడర్ కింగ్ ఏది?
ఎస్యూవీ, ఎంపీవీ, హ్యాచ్‌బ్యాక్, కూపే, సెడాన్ వంటి వాటికి మాత్రమే కాకుండా భారతీయ మార్కెట్లో ఆఫ్-రోడర్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల 5 డోర్ థార్ (థార్ రాక్స్) లాంచ్ చేసింది. అయితే ఈ విభాగంలో ఫోర్స్ కంపెనీకి చెందిన గూర్ఖా కూడా ఇప్పటికే అమ్మకానికి ఉంది. ఈ రెండు కార్లు ఒకే విభాగానికి చెందినవి కావడం వల్ల, కొనుగోలుదారులు ఏ కారు ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉందనే విషయంలో కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కార్ల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం..ధరలుమహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన థార్ రాక్స్ ప్రారంభ ధరలు రూ.12.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఫోర్స్ గూర్ఖా 5 డోర్ ప్రారంభ ధర రూ. 18 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ మీద, నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది.డిజైన్థార్ రాక్స్, ఫోర్స్ గూర్ఖా రెండూ కూడా ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ మీద ఆధారపడి ఉంటుంది. హార్డ్ టాప్ ఆప్షన్స్ కలిగిన ఈ ఆఫ్-రోడర్స్ 5 డోర్స్ పొందుతాయి. థార్ చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. గూర్ఖా కఠినమైన లేదా దృఢమైన డిజైన్ పొందుతుంది. లైటింగ్ సెటప్, సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ అన్నీ ఆకర్షణీయంగా ఉంటాయు.ఫీచర్స్మహీంద్రా థార్ రాక్స్ 10.25 ఇంచెస్ డిజిటల్ డిస్ప్లేలను పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, న్యావిగేషన్, హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటితో పాటు మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఉన్నాయి.ఫోర్స్ గూర్ఖా 5 డోర్ మోడల్ 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, ఏసీ వెంట్స్, వన్-టచ్ అప్/డౌన్ విండో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారులో ఏబీఎస్ విత్ ఈబీడీ, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.ఇంజిన్ వివరాలుమహీంద్రా థార్ రాక్స్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ పొందుతుంది. ఫోర్స్ గూర్ఖా కేవలం ఒకే డీజిల్ ఇంజిన్ ఆప్షన్ పొందుతుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.ఇదీ చదవండి: టీవీఎస్ జుపీటర్ 125 Vs హోండా యాక్టివా 125: ఏది బెస్ట్?మహీంద్రా థార్ రాక్స్ లాంగ్ జర్నీ చేయడానికి, నగర ప్రయాణానికి, కఠినమైన భూభాల్లో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఫోర్స్ గూర్ఖా కఠినమైన రహదారుల్లో కూడా హుందాగా ముందుకు వెళ్తుంది. ధర పరంగా గూర్ఖా 5 డోర్ కంటే కూడా థార్ రాక్స్ ధర చాలా తక్కువ. -
అతనితో పోల్చడమంటే కించపరిచినట్లే.. రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఒకవైపు కమెడియన్‌గా రాణిస్తూనే.. మరోవైపు జాతిరత్నాలు, విరాటపర్వం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లతో నటిస్తూ.. బిజీగా ఉన్నారు. ఇటీవల రాహుల్ రామకృష్ణ నటించిన ఇంటింటి రామాయణం సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రామకృష్ణ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: సూపర్‌స్టార్ కొత్త సినిమాకు లీగల్ సమస్యలు) ఈ ఏడాది అందరినీ కంటతడి పెట్టించిన సినిమా బలగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధానపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాహుల్ నటించిన ఇంటింటి రామాయణం సూపర్ హిట్ కావడంతో నెటిజన్స్ అతన్ని ప్రియదర్శితో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. నెట్టింట వైరలవుతున్న వాటిపై రాహుల్ రామకృష్ణ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాహుల్ ట్విటర్లో రాస్తూ.. 'నా ప్రాణ మిత్రుడు ప్రియదర్శి హార్ట్ వర్క్‌తో పాటు మంచి నటుడు. అతనితో నన్ను పోల్చడమంటే మీరు అతన్ని కించపరిచినట్లే. అతను గొప్ప నటుడే కాదు.. మంచి వ్యక్తితమున్న వ్యక్తి. ఇలా పోల్చడం మీ పిరికితనంలా అనిపిస్తుంది. నేను అతని బాటలోనే నడుస్తాను.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఇంటింటి రామాయణం చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించగా..ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో రాహుల్ తండ్రైన విషయం తెలిసిందే. పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచి.. గతేడాది నవంబర్‌లో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరికి షాకిచ్చాడు. (ఇది చదవండి: ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది) pic.twitter.com/E51s5hGVfw — Rahul Ramakrishna (@eyrahul) July 16, 2023 -
సూర్యకుమార్ కంటే రషీద్‌ఖాన్ బెటర్
-
హీరోయిన్ జీవితం అలా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వీ కపూర్
సినీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ చూసి.. జీవితం అంటే అలా ఉండాలి అనుకుంటారు సాధారణ వ్యక్తులు. కానీ, అనుకున్నంత సులభంగా, సౌకర్యవంతంగా సినీ తారల జీవితం ఉండదు. అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. 'దఢక్' సినిమాతో డెబ్యూ ఇచ్చిన ఈ భామ తనదైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల 'గుడ్ లక్ జెర్రీ' సినిమాతో ఓటీటీ ద్వారా పలకరించి నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. అలాగే వాళ్ల అమ్మ చెప్పిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ''నిజానికి ప్రతి క్షణం అమ్మను ఎంతో మిస్ అవుతున్నా. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేపేది. అమ్మ ముఖం చూడకుండా నా రోజువారీ పనులు ప్రారంభించేదాన్ని కాదు. అలాటంది ఇప్పుడు అమ్మ లేకుండా జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అని తెలిపింది. 'ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పినప్పుడు మీ అమ్మ ఏం అన్నారు?' అని అడిగిన ప్రశ్నకు.. ''మొదట్లో అమ్మ ఒప్పుకోలేదు. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టొద్దనే చెప్పింది. 'నా జీవితం మొత్తం చిత్రపరిశ్రమతోనే గడిచిపోయింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు మీకు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాను. మీరు అనుకుంటున్నట్లుగా స్టార్ జీవితం అంత సౌకర్యవంతంగా ఉండదు. అలాంటి రంగంలోకి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంటీ?' అని అమ్మ ప్రశ్నించింది. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. ఏది ఏమైనా నేను హీరోయిన్గా చేయడం నాకిష్టమని చెప్పడంతో ఆమె ఓకే చెప్పింది. నా ఇష్టానికి కాదనలేక ఆమె ఒప్పుకున్నా.. 'నువ్వు సున్నిత మనస్కురాలివి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక కొంతమంది చేసే వ్యాఖ్యలకు నొచ్చుకోక తప్పదు. ఇక్కడ నెగ్గుకు రావాలంటే మరింత కఠినంగా మారాల్సి ఉంటుంది' అని అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది'' అని జాన్వీ కపూర్ అప్పటి రోజులను గుర్తు చేసుకుంది. అనంతరం తన సినిమాలు, నటనపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ 'నేను శ్రీదేవి కూతురు కావడం వల్లే నాకు ఎక్కు విమర్శలు వస్తున్నాయి. నా మొదటి నాలుగు సినిమాలను ఆమె 300 చిత్రాలతో పోల్చి చూస్తున్నారు. నేను ఆమెలా నటించలేకపోవచ్చు. కానీ ఈ వృత్తిని ఆమెకోసం చేయాలనుకుంటున్నాను. నేను ఆమెను గర్వపడేలా చేయకుండా అలా వదిలేయలేను' అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. -
మీ పిల్లలను ఇతరులతో పోల్చవద్దు: తల్లిదండ్రులకు మోదీ సలహా
న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి చూడవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహా ఇచ్చారు. అలా పోల్చడం వల్ల వారు అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. "మన్ కీ బాత్" రేడియో కార్యక్రమం తదుపరి భాగంలో ఆయన ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పరీక్షలను ఇతరులతో పోల్చడం వల్ల వాళ్లు అనవసరంగా ఒత్తిడికి గురవుతారని అన్నారు. తమ పిల్లలు చదువులో మంచి ప్రతిభావంతులని కొంతమంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. వారి అభివృద్ధిని తమ స్నేహితులతో, తోటివారితో, సహోద్యోగులతో చెప్పుకొని గర్వపడతారు. పిల్లలపై అనవసరంగా ఒత్తిడి పెంచకుండా వారిపై నమ్మకముంచండి. అప్పుడే మంచి ఫలితాలొస్తా''యని మోడీ తెలిపారు. జాతీయ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు(సీబీఎస్ఈ) నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెలలో జరగనున్నాయి. పరీక్షల సందర్భంగా మోడీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ''మన్ కీ బాత్'' కార్యక్రమానికి ఆహ్వానించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రధానిని కలిసి గతంలో పరీక్షల సందర్భాల్లో తమ అనుభవాలను మోదీతో పంచుకున్నారు.