Rahul Ramakrishna Tweet Goes Viral Comparision With Priyadarshi - Sakshi
Sakshi News home page

Rahul Ramakrishna: అది మీ పిరికితనం.. అతను నా బెస్ట్ ఫ్రెండ్: రాహుల్ రామకృష్ణ

Published Mon, Jul 17 2023 1:03 PM

Rahul Ramakrishna Tweet Goes Viral Comparision With Priyadarshi - Sakshi

కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్‌ రామకృష్ణ. ఒకవైపు కమెడియన్‌గా రాణిస్తూనే.. మరోవైపు జాతిరత్నాలు, విరాటపర్వం, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. సినిమాలతో పాటు పలు వెబ్‌ సిరీస్‌లతో నటిస్తూ.. బిజీగా ఉన్నారు. ఇటీవల రాహుల్ రామకృష్ణ నటించిన ఇంటింటి రామాయణం సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రామకృష్ణ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: సూపర్‍స్టార్ కొత్త సినిమాకు లీగల్ సమస్యలు)

ఈ ఏడాది అందరినీ కంటతడి పెట్టించిన సినిమా బలగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధానపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాహుల్ నటించిన ఇంటింటి రామాయణం సూపర్‌ హిట్ కావడంతో నెటిజన్స్‌ అతన్ని ప్రియదర్శితో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. నెట్టింట వైరలవుతున్న వాటిపై రాహుల్ రామకృష్ణ స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

రాహుల్ ట్విటర్‌లో రాస్తూ.. 'నా ప్రాణ మిత్రుడు ప్రియదర్శి హార్ట్‌ వర్క్‌తో పాటు మంచి నటుడు.  అతనితో నన్ను పోల్చడమంటే మీరు అతన్ని కించపరిచినట్లే. అతను గొప్ప నటుడే కాదు.. మంచి వ్యక్తితమున్న వ్యక్తి. ఇలా పోల్చడం మీ పిరికితనంలా అనిపిస్తుంది. నేను అతని బాటలోనే నడుస్తాను.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

కాగా.. ఇంటింటి రామాయణం చిత్రానికి  సురేష్‌ నరెడ్ల దర్శకత్వం వహించగా..ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో రాహుల్ తండ్రైన విషయం తెలిసిందే. పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచి.. గతేడాది నవంబర్‌లో తండ్రి కాబోతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించి అందరికి షాకిచ్చాడు.

(ఇది చదవండి: ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది)

Advertisement

తప్పక చదవండి

Advertisement