ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది | intinti ramayanam thanks meet | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది

Jun 11 2023 4:38 AM | Updated on Jun 11 2023 4:38 AM

intinti ramayanam thanks meet - Sakshi

‘‘మానవ సంబంధాల నేపథ్యంలో నడిచే చిత్రం ‘ఇంటింటి రామాయణం’. కుటుంబంతో, స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. మా చిత్రానికి ప్రేక్షకుల స్పందన చూసి చాలా ఆనందం కలిగింది’’ అని డైరెక్టర్‌ సురేష్‌ నరెడ్ల అన్నారు. రాహుల్‌ రామకృష్ణ, నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు ΄ోషించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్‌ సమర్పణలో వెంకట్‌ ఉప్పుటూరి, గోపీచంద్‌ యిన్నమూరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో సురేష్‌ నరెడ్ల మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో పాజిటివ్‌ మౌత్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారు. అమెరికాలోనూ మంచి స్పందన వస్తోంది. నాకు స΄ోర్ట్‌ చేసిన నాగవంశీ, మారుతిగార్లకు, ఆహా వారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఇంటింటి రామాయణం’కి మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది.. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని నటి నవ్య స్వామి అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement