'ఇడుపు కాయితం.. జాతీయ సమస్యగా మార్చారు'': వీకే నరేశ్ | Tollywood Actor VK Naresh Responds On Idupu Kagitham Movie Title | Sakshi
Sakshi News home page

VK Naresh: 'ఇడుపు కాయితం కాంట్రవర్సీ.. మనం సిగ్గుపడాలి'

Jun 28 2026 4:52 PM | Updated on Jun 28 2026 5:14 PM

Tollywood Actor VK Naresh Responds On Idupu Kagitham Movie Title

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అదే చర్చ. ఏ సోషల్ మీడియాలో చూసినా ఆ సినిమా టైటిల్‌పైనే చర్చ నడుస్తోంది. ఒక్కసారిగా ఇప్పుడు అందరి చూపులన్నీ ఆ మూవీపైనే ఉన్నాయి. అదే ఇటీవల ప్రియదర్శి, నాగదుర్గ జంటగా ప్రకటించిన ఇడుపు కాయితం. ఈ టైటిల్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఓ చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్‌, స్థానిక మాండలీకంలో పెట్టిన ఈ టైటిల్‌పై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. తాజాగా ఈ వివాదంపై నటుడు వీకే నరేశ్ స్పందించారు.

నరేశ్ మాట్లాడుతూ..'నేను రెండు రోజులుగా గమనిస్తున్నా. ఇడుపు కాయితం అనే మూవీ టైటిల్‌ను నేషనల్ సమస్యగా మార్చారు. ఎవరో ఒకరిద్దరు కామెంట్ చేశారని.. ఒక గొప్ప మాండలీకాన్ని అవమానపరుస్తున్నారు. ఇది ఒక తెలుగువాడిగా మనం సిగ్గుతో తల దించుకోవాలి. తెలంగాణ, కోనసీమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏ మాండలీకమైన ఎన్నో పోరాటాలు జరిగాయి. మనం తెలుగువాళ్లుగా గర్వపడాలి. కేవలం ఒక సినిమాను తీసుకుని మాట్లాడడం చాలా బ్యాడ్. కరుప్పు టైటిల్ చూశాం. కాంతారను హిట్ చేశాం. సినిమాను సినిమాగే చూడండి. దయచేసి సినిమాను, భాషను కలపకండి. దీనిపై తెలుగు భాష సంఘం బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి వాటినిపై చర్చించి వెంటనే వివాదానికి ముగింపు పలకాలి. మన సొంత భాషను మనం నరుక్కుంటే ఎంత సిగ్గుచేటు. ప్రభుత్వం, మీడియా, తెలుగు భాష సంఘం, నెటిజన్స్ అందరూ కలిసి దయచేసి ఈ వివాదాన్ని ముగిద్దాం' అంటూ వీడియో రిలీజ్ చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement