
2025 ప్రారంభమై ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయింది. ఇప్పటికే లెక్కకు మించిన కొత్త కార్లు, అప్డేటెడ్ కార్లు లాంచ్ అయ్యాయి. కాగా ఈ ఏడాది లాంచ్ కావడానికి మరికొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. కొత్త కారు కొనాలని ఎదురుచూస్తున్న వాళ్లకు.. అవి బహుశా మంచి ఎంపిక కావొచ్చు. జీఎస్టీ సంస్కరణలు కూడా ధరలను కొంత తగ్గేలా చేస్తాయి.
2025 చివరి నాటికి దేశంలో లాంచ్ అయ్యే కార్లు
●మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్
●మారుతి విక్టోరిస్
●టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
●కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ
●టాటా సియెర్రా ఈవీ
●స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్
●వోక్స్‌వ్యాగన్ టేరాన్
మారుతి సుజుకి కొత్త విక్టోరిస్.. ఇప్పటికే షోరూమ్‌లకు రావడం ప్రారంభించింది. కాగా దీని ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ కారు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా పొందుతుంది. విక్టోరిస్ మూడు పవర్‌ట్రెయిన్ (పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, పెట్రోల్-CNG) ఎంపికలలో లభిస్తుంది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కూడా అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో చిన్న డిజైన్ మార్పులు, అప్డేటెడ్ ఫీచర్స్ ఉండనున్నాయి. నవంబర్‌లో టాటా సియెర్రా ఈవీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది హారియర్ ఈవీ మాదిరిగా ఉండనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కూడా కొత్త తరం వెన్యూ లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది.
ఇదీ చదవండి: డీజిల్‌లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటన
మహీంద్రా థార్ కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కానుంది. ఇది థార్ రాక్స్ మాదిరిగానే.. అదే ఇంజిన్, గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది. స్కోడా తన పెర్ఫార్మెన్స్ సెడాన్ ఆక్టేవియా ఆర్ఎస్ లాంచ్ చేయనుంది. దీనిని కంపెనీ భారతదేశానికి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి దీని ధర రూ. 50 లక్షలు ఉండే అవకాశం ఉంది. వోక్స్‌వ్యాగన్ 2025 చివరి నాటికి టేరాన్ ప్రీమియం 7-సీటర్ లాంచ్ చేసే యోచనలో ఉంది.