బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐలు) వాటాను 100 శాతానికి పెంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనుంది. 2047కల్లా అందరికీ బీమా సౌకర్యాన్ని కల్పించే యోచనతో ఈ వారంలో బిల్లును ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. సబ్‌కి బీమా సబ్‌కి రక్ష(బీమా చట్టాల సవరణ) చట్టం 2025 పేరుతో 1938 బీమా చట్టంలో సవరణలకు బిల్లును ప్రవేశపెట్టనుంది.
జీవిత బీమా కార్పొరేషన్ చట్టం 1956, బీమా నియంత్రణ, అభివృద్ది అథారిటీ చట్టం 1999లో సవరణలకు బిల్లు వీలు కలి్పంచనుంది. తాజా సవరణల ద్వారా బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని ప్రస్తుత 74 శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నట్లు బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. అయితే చైర్మన్, ఎండీ లేదా సీఈవో పదవికి తప్పనిసరిగా భారత పౌరుడిని నియమించుకోవలసి ఉంటుంది.
ఇదీ చదవండి: ఐటీ కంపెనీలు లాభాల బాట పట్టాలంటే!


