-
స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్ప్రైజ్
డై హార్డ్ ఫ్యాన్స్ ఉండే హీరోల్లో తలా అజిత్ ఒకడు. తమిళనాడులో ఇతడికి కోట్లాదిమంది అభిమానులున్నారు. తెలుగులోనూ ఇతడికి ఓ మాదిరి గుర్తింపు ఉంది. అడపాదడపా యాక్షన్ సినిమాలతో ఆకట్టుకునే ఇతడు ప్రస్తుతం ఓ రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. బుధవారం ఇతడి 53వ పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇతడి భార్య మాత్రం అదిరిపోయే గిఫ్ట్‌తో సర్ప్రైజ్ చేసింది.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)1990లోనే నటుడిగా కెరీర్ ప్రారంభించిన అజిత్.. 'ప్రేమ పుస్తకం' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పూర్తిగా తమిళంకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం 'విడామయూర్చి' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు. తాజాగా బుధవారం అజిత్ 53వ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు.ఈ క్రమంలోనే అజిత్ భార్య షాలిని.. భర్తకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. బైక్స్ అంటే అజిత్ ఎంత ఇష్టమో బాగా తెలిసిన షాలిని.. ఈ బర్త్ డే కానుకగా డుకాటీ బైక్ బహుమతిగా ఇచ్చింది. మార్కెట్లో దీని ధర రూ.10 లక్షలు పైమాటే. ఏదేమైనా ఇలా బైక్ ఇచ్చి పుట్టినరోజు సర్ప్రైజ్ చేయడం అజిత్ అభిమానులకు తెగ నచ్చేసింది. (ఇదీ చదవండి: పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్) Shalini Ajith gifted Ducati bike for Thala #Ajith 🥰#HBDAjithKumar 🎉🎂#VidaaMuyarchi .. #AjithKumar#GoodBadUgly #Ajithkumar𓃵 pic.twitter.com/aWYnXAI5CU— 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) May 1, 2024 -
ఈ బైక్ కొనుగోలుపై రూ.1.97 లక్షల డిస్కౌంట్ - నేడే ఆఖరు..
భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది బైక్ రైడర్లు ఇష్టపడే బైక్ బ్రాండ్లలో ఒకటి 'డుకాటి' (Ducati). ఫెస్టివల్ సీజన్ పూర్తయిన తరువాత కూడా ఈ కంపెనీ కస్టమర్ల కోసం ఎంపిక చేసిన మోడల్ మీద భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఏ బైకుపై సంస్థ డిస్కౌంట్ అందిస్తోంది, డిస్కౌంట్ తర్వాత ఈ బైక్ ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డుకాటి కంపెనీకి చెందిన మాన్స్టర్ (Monster) బైకుపై సంస్థ ఏకాంగి రూ. 1.97 లక్షలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ ధర రూ. 12.95 లక్షలు కాగా.. డిస్కౌంట్ తరువాత ఇది రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ రోజు (నవంబర్ 30) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డుకాటి మాన్స్టర్ బైక్ 937 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలిగి 9250 ఆర్పీఎమ్ వద్ద 109 బీహెచ్పీ పవర్, 6500 ఆర్పీఎమ్ వద్ద 92 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్, డుకాటి క్విక్ షిఫ్ట్ ద్వారా 6-స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది, తద్వారా అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల నిర్ణయంపై 'ఎలాన్ మస్క్' ఘాటు వ్యాఖ్యలు దేశీయ మార్కెట్లో డుకాటి మాన్స్టర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, ఎస్పీ వేరియంట్లు. ప్రారంభంలో ఈ బైక్ రూ. 15.95 లక్షల ధర వద్ద విడుదలైంది, ఆ తరువాత ఈ ధరలు కొంత అతగ్గుముఖం పట్టాయి. దీంతో ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. -
డెలివరీ బాయ్‌కి ఇంత ఖరీదైన బైకా? అవాక్కవుతున్న నెటిజన్లు - వీడియో వైరల్
జొమాటో, స్విగ్గి వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారే కాదు, వాటి ద్వారా సంపాదించుకునే వారు కూడా ఎక్కువైపోయారు. దీంతో కొంతమంది తమ లగ్జరీ బైకులను డెలివరీ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ యూజర్ రాజ్ గోథాంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసినట్లయితే ఇందులో ఖరీదైన డుకాటి కంపెనీ బైక్ కనిపిస్తుంది. దీని ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దీనిపైన కూర్చున్న డెలివరీ బాయ్ జొమాటో షర్ట్ ధరించి ఉన్నాడు. అతడు తన ప్రతి ఆర్డర్‌కు 200 వరకు సంపాదిస్తున్నట్లు, అందులో రూ. 50 పెట్రోలు కోసం వెచ్చించినా.. తనకి రూ. 150 మిగులుతుందని.. ఇలా రోజుకి 20 ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు. నెలకు రూ. 45,000.. వీడియోలో కనిపించే వ్యక్తి చెప్పినదాని ప్రకారం, అతడు నెలకు రూ. 45,000 సంపాదిస్తానని చెప్పాడు. నిజానికి ప్రతి ఆర్డర్‌కు రూ. 30 నుంచి రూ. 40 మాత్రమే వస్తుందని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్షిప్.. 5వేల విద్యార్థులకు అవకాశం - లాస్ట్ డేట్ ఎప్పుడంటే? అతడు చెప్పినదాని ప్రకారం రోజుకి రూ. 3000, ఇలా నెలకు రూ. 90,000 సంపాదించాలి అంటూ ఒకరు. డుకాటి ఇండియా కూడా ఎమోజితో కామెంట్ చేసింది. మరి కొంతమంది కామెడీ కోసం చేసిన వీడియో మాదిరిగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. View this post on Instagram A post shared by Raj Gothankar (@raj_official_2151) -
చిరుత లాంటి వేగం ఈ బైక్ సొంత - ధర ఎంతో తెలుసా?
Ducati Panigale V4R: భారతదేశంలో సరసమైన బైకులు మాత్రమే కాకుండా అత్యంత ఖరీదైన బైకులు కూడా అమ్ముడవుతున్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో కవాసకి, డుకాటి మొదలైన బ్రాండ్ బైకులు ఉన్నాయి. తాజాగా డుకాటి ఇండియన్ మార్కెట్లో సరికొత్త ఖరీదైన బైకును లాంచ్ చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డుకాటి విడుదల చేసిన బైక్ పేరు 'పానిగలె వి4 ఆర్' (Panigale V4 R). దీని ధర అక్షరాలా రూ. 69.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా మరింత ఎక్కువ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులోని 998 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ 215 bhp పవర్ అందిస్తుంది. 2019 నుండి కంపెనీ భారతదేశంలో V4R విక్రయించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ లేటెస్ట్ బైక్ రేస్ టీమ్‌ల కోసం అందించే కొన్ని ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున గన్ డ్రిల్డ్, పిస్టన్ వంటి వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న హ్యుందాయ్ ఎక్స్టర్ - ఫస్ట్ యూనిట్ చూసారా!) ఇది ట్రాక్-ఓరియెంటెడ్ సూపర్‌బైక్ అయినందున ఎలక్ట్రానిక్స్ సూట్‌తో వస్తుంది. వీటిలో కొత్త 'ట్రాక్ ఈవో' మోడ్, రీకాలిబ్రేటెడ్ డుకాటీ ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ బై వైర్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ EVO2 సిస్టమ్‌లు ఉన్నాయి. రైడర్ ఎంచుకోవడానికి ఫుల్, హై, మీడియం, లో అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ బైక్ ముందు భాగంలో 1 అనే నెంబర్ ఉండటం చూడవచ్చు. ఇది వరల్డ్ సూపర్‌బైక్‌లలో డుకాటి ఆధిపత్యాన్ని చూపించడానికి ఉపయోగపడుతుంది. ఈ బైక్ కూడా సీబీయు (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా అమ్ముడవుతాయి. ఇప్పటికే భారత్‌కు ఐదు యూనిట్లు వచ్చాయని, అవన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది. -
ఈ బైక్స్ కొనుగోలుపై కనీవినీ ఎరుగని బెనిఫిట్స్ - రూ. 4 లక్షల వరకు..
Ducati Benefits: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ బైక్ బ్రాండ్స్‌లో ఒకటైన 'డుకాటి' (Ducati) తన 10వ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా కంపెనీకి చెందిన కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద రూ. 4 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. కంపెనీ అందించనున్న ఈ బెనిఫీట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బెనిఫీట్స్.. నివేదికల ప్రకారం, డుకాటి ఇండియా ఇప్పుడు తన స్ట్రీట్‌ఫైటర్ వి4, మల్టీస్ట్రాడా వి4 మోడల్స్ మీద ఏకంగా రూ. 4 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ బైక్స్ అసలు ధరలు దేశీయ మార్కెట్లో రూ. రూ. 22.15 లక్షలు, రూ. 21.48 లక్షలు కావడం గమనార్హం. అదే సమయంలో స్ట్రీట్‌ఫైటర్ వి2, మల్టీస్ట్రాడా వి2, మాన్స్టర్ మోడల్స్ మీద రూ. 2 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మోడల్ బైకుల అసలు ధరలు రూ. 18.10 లక్షలు, రూ. 16.05 లక్షలు, రూ. 12.95 లక్షలు. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) కంపెనీ అందిస్తున్న ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్ కాదు, అయితే డుకాటి బ్రాండ్ దుస్తులు, యాక్ససరీస్ వంటివి పొందవచ్చు. ఈ బెనిఫీట్స్ కూడా స్టాక్ ఉన్నత వరకు మాత్రమే లభిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను కొనుగోలుదారులు సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌లను సందర్శించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వంశీచంద్ అభ్యర్థి కాదు.. రేవంత్ షాడో
ఈవీఎంల స్ట్రాంగ్‌రూంల వద్ద పటిష్ట బందోబస్తు
ప్రతి అంశంపై అవగాహన ఉండాలి
ఎఫ్ఎస్టీపీని పరిశీలించిన ప్రతినిధి
ఈదురుగాలుల బీభత్సం
11న జిల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు న్యాయం
ఉల్లి క్వింటా రూ.2,400
అధికారం వెంటే నేతలు..!
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- బ్లూచిప్స్‌కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement