భారత్‌లో డుకాటీ హైపర్‌మోటార్డ్‌ 950 | Ducati Introducing HyperMotard 950 In India | Sakshi
Sakshi News home page

భారత్‌లో డుకాటీ హైపర్‌మోటార్డ్‌ 950

Nov 11 2021 12:36 PM | Updated on Nov 11 2021 12:50 PM

Ducati Introducing HyperMotard 950 In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇటాలియన్‌ సూపర్‌బైక్స్‌ తయారీ కంపెనీ డుకాటీ తాజాగా భారత్‌లో హైపర్‌మోటార్డ్‌ 950 మోడల్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో హైపర్‌మోటార్డ్‌ 950 ఆర్‌వీఈ రూ.12.99 లక్షలు, హైపర్‌మోటార్డ్‌ 950 ఎస్‌పీ రూ.16.24 లక్షలు ఉంది. ట్విన్‌ సిలిండర్‌ ఇంజన్, 114 హెచ్‌పీ పవర్, 14.5 లీటర్ల సామర్థ్యంతో ఇంధన ట్యాంక్, స్పోర్ట్, టూరింగ్‌ మోడ్స్‌తో రూపొందించింది.

హూపర్‌మెటార్డ్‌ 950 బైక్‌ డెలివరీలు ప్రారంభం అయినట్టు డుకాటీ తెలిపింది. అంతర్జాతీయంగా విజయవంతం కావడంతో ఈ మోడల్‌ను  ఇక్కడి మార్కెట్లో పరిచయం చేసినట్టు వివరించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement